Amit Mishra | పెళ్లి కాకున్నా గృహహింస కేసు.. మండిపడుతున్న మాజీ క్రికెటర్..!
Amit Mishra : ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో, మీడియాలో వదంతులకు కొదవ ఉండడం లేదు. సెలబ్రిటీలను, క్రికెటర్లను లక్ష్యం చేసుకొని తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. తాజాగా భారత మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా (Amit Mishra |)కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
Amit Mishra : ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో, మీడియాలో వదంతులకు కొదవ ఉండడం లేదు. సెలబ్రిటీలను, క్రికెటర్లను లక్ష్యం చేసుకొని తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. తాజాగా భారత మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా (Amit Mishra |)కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అతడి పేరిట తప్పుడు కేసు నమోదు అయింది. గృహహింసకు పాల్పడుతున్నాడని అతడిపై, అతడి కుటుంబసభ్యులపై మిశ్రా భార్య కేసు పెట్టిందనే వార్త మీడియాలో క్షణాల్లో వైరలైంది. అయితే.. తాను అసలు పెళ్లి చేసుకోలేదని.. అలాంటప్పుడు డొమెస్టిక్ వయొలెన్స్ కేసు ఎలా పెడతారు? అని మిశ్రా మండిపడుతున్నాడు.
‘నాపై మీడియాలో ప్రచారం అవుతున్న తప్పుడు కథనాలు చూసి చాలా అసహనానికి గురవుతున్నాను. నాకు మీడియాపై చాలా గౌరవం ఉంది. అయితే.. గృహ హింస కేసు వాస్తవం కావచ్చు. కానీ, నిజమైన వ్యక్తి బదులు నా ఫొటోను ఉపయోగించారు. అది పెద్ద పొరపాటు. నాకు అసలు పెళ్లే కాలేదు. కానీ, నా పేరు, ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నారు కొందరు.
I’m extremely disappointed by what’s being circulated in the media. I’ve always respected the press, but while the news itself may be accurate, the photograph used is mine—which is completely incorrect. Using my image for unrelated stories must stop immediately, or I will be…
— Amit Mishra (@MishiAmit) April 22, 2025
అందుకే.. లేనిపోని కథలు అల్లుతున్నారు. మీకు విజ్ఞప్తి చేస్తున్నా.. దయచేసి అలాంటి వదంతులను తక్షణమే ఆపేయండి’ అని మిశ్రా మీడియాను కోరాడు. అయితే.. 2015లో అమిత్ మిశ్రా స్నేహితురాలిపై లైగింక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యాడు. ఐపీసీ 354, 323, 324 సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. ఆ తర్వాత బెయిల్‌పై విడుదుల అయ్యాడు.
68 మ్యాచ్‌లు
లెగ్ స్పిన్నర్ అయిన మిశ్రా 2003లో టీమిండియాకు ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికా మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. 2010లో టీ20ల్లో తొలి మ్యాచ్ ఆడిన మిశ్రా దేశం తరఫున 68 మ్యాచ్‌లు ఆడాడు. మిశ్రా 2017లో చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్ 17వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడిన మిశ్రా.. 18వ సీజన్‌కు మాత్రం స్వచ్ఛందంగా దూరమయ్యాడు. అయితే.. ఈ మాజీ స్పిన్నర్ అధికారికంగా మాత్రం వీడ్కోలు పలకలేదు.
🚨Big Shocking News 🗞️ 🚨
Former IPL Legend Amit Mishra has reportedly been booked and arrested over domestic violence and dowry charges filed by his wife. #AmitMishra pic.twitter.com/mA8Pzz6Xhx
— Mohit Kamal Rath (@mkr4411) April 22, 2025
ఇవి కూడా చదవండి
- MLA Sabitha | ఇంద్రారెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : ఎమ్మెల్యే సబిత
- Bomb Threats | పలు రాష్ట్రాల హైకోర్టులకు వరుస బాంబు బెదిరింపులు.. పోలీసుల హై అలర్ట్
- Jawahar nagar | జవహర్‌నగర్ వాసులు త్వరలోనే శుభవార్త వింటారు : కాప్రా తహశీల్దార్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

