Javelin Throw : భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్కు ఉండే క్రేజ్ తెలిసింది. ఈమధ్య ఇరుదేశాల అథ్లెట్ల మధ్య జావెలిన్ త్రో పోటీ కూడా అంతే ఉత్కంఠ రేపుతోంది. అంతర్జాతీయ వేదికలపై నీరజ్ చోప్రా(Neeraj Chopra), అర్షద్ నదీమ్ (Arshad Nadeem) తగ్గేదేలే అన్నట్టు పోటీ పడుతుండడమే అందుకు కారణం. ఒకప్పుడు స్నేహితుల్లా మెలిగిన వీళ్లు ఈసారి ప్రత్యర్థులుగానే బరిలోకి దిగబోతున్నారు. పారిస్ ఒలింపిక్స్ తర్వాత తొలిసారి నువ్వానేనా అన్నట్టు ఈటెను విసిరేందుకు సిద్ధమవుతున్నారు ఇద్దరు. పొలాండ్లోని సెలేసియాలో ఆగస్ట్ 16న జరుగబోయే డైమండ్ లీగ్లో దాయాది అథ్లెట్లు తమ తడాఖా చూపించనున్నారు.
జావెలిన్ త్రోలో దిగ్గజ ఆటగాడిగా ఎదిగిన నీరజ్ టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణంతో చరిత్ర సృష్టించాడు. పారిస్ విశ్వ క్రీడ్లలోనూ అతడు గోల్డ్ మెడల్ సాధిస్తాడనుకున్నారంతా. కానీ, నదీమ్ 92.97 మీటర్ల దూరంతో నీరజ్(89.45 మీటర్లు)కు షాకిచ్చాడు. అయితే.. నిరుడు ఆగస్టు 8న చివరిసారి పోటీపడిన ఈ ఇద్దరూ త్వరలోనే పొలాండ్ డైమండ్ లీగ్లో ఎదురుపడనున్నారు.
హల్గాం ఉగ్రదాడి, ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) తదనంతర పరిణామాలతో ఇరుదేశాల మధ్య వైరం మరింత పెరిగిన నేపథ్యంలో నీరజ్, నదీమ్ల జావెలిన్ ఫైట్ అందరిలో ఆసక్తి రేపుతోంది. ఈమధ్యే దోహా డైమండ్ లీగ్లో 90 మీటర్ల మార్క్ అందుకున్న భారత బడిసె వీరుడు ఈసారి పాకిస్థాన్ అథ్లెట్కు ఝలక్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ టోర్నీ తర్వాత సెప్టెంబర్లో వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో నీరజ్ పోటీపడనున్నాడు.
Indian javelin throw superstar Neeraj Chopra to face Pakistan’s reigning Olympic champion Arshad Nadeem in Diamond League in Silesia, Poland on August 16 for the first time after their Paris Games showdown in 2024 #AFI pic.twitter.com/Myc5IGMyLT
— Press Trust of India (@PTI_News) July 12, 2025