Archery World Cup Stage 4 : స్పెయిన్ వేదికగా జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 4 (Archery World Cup Stage 4)లో భారత మహిళా బృందం పతకాల వేట కొనసాగిస్తోంది. జ్యోతి సురేఖ (Jyothi Surekha), పర్నీత్ కౌర్(Parneet Kaur), ప్రీతికా ప్రదీప్ (Prithika Pradeep)లతో కూడిన త్రయం శనివారం జరిగిన కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో రజతం కొల్లగొట్టింది. పోడియం మీద మువ్వన్నెల జెండాను ఈ ముగ్గురు రెపరెపలాడించగా.. మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ గురి అదరడంతో కాంస్యం కూడా వచ్చి చేరింది.
క్వాలిఫికేషన్ రౌండ్లో 16 ఏళ్ల ప్రీతికా 2,116 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. దాంతో, భారత బృందం ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే.. పసిడి పోరులో ఒత్తిడికి లోనైన త్రయం రెండో స్థానంతో సిల్వర్ మెడల్‌కే పరిమితమైంది. చైనీస్ తైపీ బృందం స్వర్ణం ఎగరేసుకుపోయింది.
NEWS FLASH: India win BRONZE medal in Compound Mixed Team event at ARCHERY World Cup in Madrid.
Jyothi Vennam & Rishabh beat El Salvador duo 156-153 in Bronze medal match. #Archery pic.twitter.com/u86SO4UQcw
— India_AllSports (@India_AllSports) July 12, 2025
అనంతరం జరిగిన మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సురేఖ, రిషభ్ యాదవ్ ద్దయం 1,431 పాయింట్లతో వరల్డ్ రికార్డు నెలకొల్పారు. పదో సీడ్ జంటను చిత్తు చేసి దేశానికి కాంస్యం అందించారు. అయితే.. మహిళల కాంపౌండ్ టీమ్ సెమీఫైనల్లో మాత్రం భారత ఆర్చర్లు తీవ్రంగా నిరాశపరిచారు. నెదర్లాండ్స్‌కు చెందిన12వ సీడ్ల ముందు నిలువలేక నిష్క్రమించారు.