చెన్నూర్ : చెన్నూర్ పట్టణ ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం పట్టణ సమీపంలోని గోదావరిలో (Godavari) ఇసుక క్వారీ ని (Sand quarry) ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ రాజా రమేష్ డిమాండ్ చేశారు. గోదావరిలో ఇసుక క్వారీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ట్రాక్టర్ల యజమానులు చేస్తున్న సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు.
కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి సమ్మెను పరిష్కరించాలని, లేదా మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడి నుండి నిత్యం వందలాది లారీల్లో హైదరాబాద్ లాంటి దూరప్రాంతాలకు గోదావరి నుండి ఇసుక తరలి పోతుంటే, స్థానికులు మాత్రం సమీపంలోని గోదావరి ఇసుకను ఉపయోగించు కోలేని పరిస్థితి ఉందని వాపోయారు.
కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మోతే తిరుపతి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నవాజ్, కోటపల్లి మాజీ వైస్ ఎంపీపీ వాల శ్రీనివాస రావు, మాజీ సర్పంచ్ సాధన బోయిన కృష్ణ, మాజీ కౌన్సిలర్లు రేవెల్లి మహేష్, జగన్నాధుల శ్రీనివాస్, కోటపల్లి సింగల్ విండో చైర్మన్ సాంబ గౌడ్, రైతుబంధు సమితి మాజీ మండల కన్వీనర్ రత్న సమ్మిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మేడ సురేష్ రెడ్డి, పెండ్యాల లక్ష్మణ్, అయిత సురేష్ రెడ్డి, నయాబ్, ఆసం పెళ్లి సంపత్, భోగే భారతి, ముత్యాల సత్యవతి తదితరులు పాల్గొన్నారు.