పినపాక, జనవరి 7: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 69వ జాతీయస్థాయి కబడ్డీ పోటీలు బుధవారం మొదలయ్యాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో..కంది చారిటబుల్ ట్రస్, మౌరి టెక్ సౌజన్యంతో నిర్వహిస్తున్న పోటీలకు 33 జట్లు బరిలో ఉన్నాయి. పోటీలను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు ప్రారంభించారు.
టోర్నీలో తొలి రోజు మొత్తం 14 మ్యాచ్‌లు అభిమానులను అలరించాయి. మధ్యప్రదేశ్ 66-38తో చండీగఢ్‌పై, ఆంధ్రప్రదేశ్ 52-19తో జార్ఖండ్‌పై, పుదుచ్చేరి 61-34తో పశ్చిమబెంగాల్‌పై, తమిళనాడు 48-32తో బీహార్‌పై, కర్ణాటక 51-27తో గుజరాత్‌పై, మహారాష్ట్ర 44-41తో కేరళపై, రాజస్థాన్ 34-33తో యూపీపై గెలిచి టోర్నీలో ముందంజ వేశాయి. ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్ జితేశ్ పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు తదితరులు పాల్గొన్నారు.