Najmul Hussain Shanto : బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో (Najmul Hussain Shanto) షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. శ్రీలంకతో జరిగిన కొలంబో టెస్టులో భారీ ఓటమి అనంతరం సారథిగా వైదొలుగుతున్నానని చెప్పాడు. ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దాంతో.. నేను ఒక ప్రకటన చేయాలనుకుంటున్నా అని మ్యాచ్ తర్వాత మీడియా సమావేశంలో అందరిలో ఆసక్తి రేపాడు.
‘బంగ్లాదేశ్ టెస్టు కెప్టెన్సీకి నేను రాజీనామా చేస్తున్నా. సుదీర్ఘ ఫార్మాట్లో సారథిగా కొనసాగాలని అనుకోవడం లేదు. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నా. ఇది నా వ్యక్తిగత విషయం కాదు. జట్టు మొత్తానికి ఉపయోగడపాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నా. నేను కెప్టెన్‌గా వైదొలగడంతో కొత్త నాయకత్వంలో టీమ్ మరింత మెరుగ్గా రాణిస్తుందని ఆశిస్తున్నా’ అని శాంటో వెల్లడించాడు.
“I don’t want to continue [as captain] in the Test format anymore. This is not personal. I have taken the decision for the betterment of the team. I think this will help the team.” Najmul Hossain Shanto said. #najmulhossainshanto #testretirement #bangladeshcricket pic.twitter.com/MTTPIou40G
— Crictoday (@crictoday) June 28, 2025
అంతేకాదు బంగ్లాదేశ్‌కు మూడు ఫార్మట్లలో ముగ్గురు కెప్టెన్లు అవసరం లేదని శాంటో అభిప్రాయపడ్డాడు. అందుకే అతడు టెస్టు సారథి బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఇప్పటికే శాంటో టీ20 కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. దాంతో, ఈమధ్యే బోర్డు వన్డే కెప్టెన్‌గా మెహిదీ హసన్ మిరాజ్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. గత రెండు మూడేళ్లుగా నాకు డ్రెస్సింగ్ రూమ్‌లో గడిపే అవకాశం లభించింది.
అయితే.. మూడు ఫార్మట్లకు ముగ్గురు సారథులు అవసరం లేదని నా అభిప్రాయం. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. ఈ విషయంలో బోర్డు నాతో ఏకీభవిస్తుందని నమ్ముతున్నా అని శాంటో తెలిపాడు. 2023 నవంబర్‌లో అతడు బంగ్లా టెస్టు సారథిగా పగ్గాలు చేపట్టాడు. శాంటో నేతృత్వంలో బంగ్లా 14 టెస్టులు ఆడింది. వీటిలో నాలుగు మ్యాచుల్లో విజయం సాధించింది. ఇందులో పాకిస్థాన్‌పై నిరుడు ఆగస్టులో చిరస్మరణీయ విక్టరీ కూడా ఉంది.