Mahesh Bigala | దేశానికి అపూర్వ సేవలు అందించిన పీవీ: మహేశ్ బిగాల
భారతరత్న, దేశ పునర్నిర్మాణ శిల్పి పీవీ నరసింహారావుకు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల (Mahesh Bigala) ఆస్ట్రేలియాలో ఘనంగా నివాళులు అర్పించారు.
ఆస్ట్రేలియా, జూన్ 28: భారతరత్న, దేశ పునర్నిర్మాణ శిల్పి పీవీ నరసింహారావుకు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల (Mahesh Bigala) ఆస్ట్రేలియాలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ‘తెలంగాణ రాష్ట్ర సాధకుడు కే. చంద్రశేఖర్ రావు పిలుపు మేరకు విదేశాల్లో పీవీ నరసింహా రావు ఘనతను స్మరించుకునేలా విగ్రహాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో భాగంగా ఆస్ట్రేలియాలో మొట్టమొదటి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గర్వకారణం. ప్రధానమంత్రి హోదాలో దేశానికి పీవీ అపూర్వ సేవలందించారు. 1991 ఆర్థిక సంక్షోభ సమయంలో తీసుకున్న సంస్కరణలతో భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక రంగంలోకి చేర్చిన ఘనత పీవీకే దక్కుతుంది.
బీఆర్ఎస్ పార్టీ పీవీకి భారతరత్న ఇవ్వాలని దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభించింది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఈ ఉద్యమాన్ని ఎన్ఆర్ఐ వేదికలపైనా విస్తరించి, గ్లోబల్ పిటిషన్ ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా మద్దతు పొందేలా పిలుపునిచ్చారు. పీవీ జీవితసాధనను గుర్తించి భారతరత్న ప్రకటించాలని ఎన్నో దేశాల్లో నివాళుల కార్యక్రమాలు, ప్రచారాలు నిర్వహించారు. హైదరాబాద్‌లో పీవీ ఘాట్ నిర్మాణం, రాష్ట్ర అవతరణ వేడుకల్లో ప్రత్యేక నివాళులర్పించడం వంటివి ఆయనకు అర్పించిన నిబద్ధతకు నిదర్శనాలు.
పీవీ లాంటి గొప్ప నాయకుడిని ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిపేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరం. ఆయనకు భారతరత్న రావాలన్న ఉద్యమం ప్రజల ఆశయంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐలు చురుకుగా పాల్గొనడం గర్వంగా ఉంది. ఈ పోరాట ఫలితంగా పీవీ నరసింహారావు భారతరత్న ప్రకటించబడింది. ఇది బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రజలు ఆయనకు అర్పించిన గౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది.’ అని చెప్పారు. ఆస్ట్రేలియాలో పీవీ విగ్రహం ఏర్పాటు చేయడానికి సహకారం అందించిన స్థానిక కౌన్సిల్‌కు, స్ట్రాత్‌ఫీల్డ్ కౌన్సిలర్ సాండీ రెడ్డికి అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ భారతి రెడ్డి, నారాయణ రెడ్డి, సాండీ రెడ్డి, యతిన్ గుప్తా, రాజేశ్, లివింగ్స్టన్ చిటపల్లి, రంగారెడ్డి, గునీత్ సింగ్ రంధావా, రాజేశ్ రాపోలు, కిషోర్, రాజ్ కుమార్, కరీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎదుళ్ల నుండి డిండిని అడ్డుకోవద్దు : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Zelensky: రష్యా దాడి.. 6 లక్షల మంది అంధకారంలో: జెలెన్స్కీ
SriLankan Tamil Engineer | శ్రీలంక తమిళ ఇంజినీర్‌కు ఊరట.. మరణశిక్షను రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

