Duleep Trophy 2024 : భారత క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan) తమ్ముడు దుమ్ము రేపుతున్నాడు. అచ్చం అన్న లెక్కనే దూకుడైన ఆటతో రెచ్చిపోతున్నాడు. అవసరమైన ప్రతిసారి ఆపద్భాందవుడి అవతారమెత్తి జట్టును ఆదుకుంటున్నాడు. ఇప్పటివరకూ రంజీల్లో, అండర్ -19 వరల్డ్ కప్‌లో దంచి కొట్టిన ముషీర్ ఖాన్ (Musheer Khan).. ఇప్పుడు దులీప్ ట్రోఫీ(Duleep Trophy 2024)లోనూ తన ఆరంగేట్రాన్ని ఘనంగా చాటాడు.
తొలి మ్యాచ్‌లోనే ఈ యంగ్‌స్టర్ శతకంతో సింహ గర్జన చేశాడు. పీకల్లోతు కష్టాల్లో పడిన ‘ఇండియా బీ’ జట్టును ముషీర్ తన సూపర్ సెంచరీతో ఒడ్డున పడేశాడు. 105 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టించాడు. దులీప్ ట్రోఫీ ఆరంభ పోరులో ‘ఇండియా బీ’ బ్యాటర్లు తడబడ్డారు. చిన్నస్వామి స్టేడియంలో ‘ఇండియా ఏ’ బౌలర్ల ధాటికి టాప్ ఆటగాళ్లంతా డగౌట్ బాట పట్టగా.. 94 పరుగులకే 4 వికెట్లు పడ్డాయి.
Musheer Masterclass 👌👌
Musheer Khan headlined India B’s fight against India A with a superb century. He’s unbeaten on 105 at the end of the day’s play.
Re-live some of his delightful strokes 🔽
Follow the match ▶️ https://t.co/eQyu38Erb1 pic.twitter.com/91UPakOr0c
— BCCI Domestic (@BCCIdomestic) September 5, 2024
ఆ దశలో క్రీజులోకి వచ్చిన ముషీర్ అసాధారణ ఆటతో అదరగొట్టాడు. క్రీజులో పాతుకుపోయి.. ప్రత్యర్థి బౌలర్లను ముప్పతిప్పలు పెట్టిన ముషీర్ సూపర్ శతకంతో ఆదుకున్నాడు. సీనియర్లు అభిమన్యు ఈశ్వరన్(13), సర్ఫరాజ్ ఖాన్(9), రిషభ్ పంత్(7)లు చేతులెత్తేసిన చోట.. ఇండియా ఏ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ జట్టు స్కోర్బోర్డను ముషీర్ నడిపించిన తీరు అమోఘం. టెయిలెండర్ నవ్‌దీప్ సైనీ(29 నాటౌట్)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అతడి సమయోచిత ఇన్నింగ్స్ కారణంగా ఇండియా బీ జట్టు 7 వికెట్ల నష్టానికి 202తో తొలి రోజును ముగించింది.
Stumps on Day 1!
An exciting day’s play comes to an end. India C move to 91/4.
Axar Patel’s superb all-round efforts (86 & 2/16) help India D fight back hard.
Baba Indrajith and Abishek Porel have steadied India C’s ship after they were reduced to 43/4. pic.twitter.com/gxkGDfDduT
— BCCI Domestic (@BCCIdomestic) September 5, 2024
ఈ ఏడాది ముంబై జట్టు రంజీ ట్రోఫీని నిలబెట్టుకోవడంలో ముషీర్ పాత్ర మరువలేనిది. అలాగని అతడికి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పెద్దగా అనుభవం ఉందనుకునేరు. ఇప్పటివరకూ ముంబై తరఫున 5 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడంతే. విదర్భతో జరిగిన ఫైనల్లో ఈ యంగ్‌స్టర్ అదరగొట్టాడు.
రెండో ఇన్నింగ్స్‌లో సీనియర్లు విఫలమైనా ముషీర్ 136 పరుగులతో ముంబై భారీ స్కోర్‌లో భాగమయ్యాడు. తనుశ్ కొటియాన్, ధవల్ కులకర్ణిల విజృంభణతో ముంబై 169 పరుగుల తేడాతో గెలుపొందింది. దాంతో, ఆ జట్టు ఖాతాలో రికార్డు స్థాయిలో 42వ టైటిల్ చేరింది.