జయశంకర్ భూపాలపల్లి : ప్రమాదవశాత్తు చెరువులో(Pond) పడి పశువుల కాపరి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన గురువారం జయశంకర్ భూపాలపల్లి(Jayashankar Bhupalapally) జిల్లా కాటారం మండలంలోని ప్రతాపగిరి గ్రామపంచాయతీ పరిధి మర్రిపల్లిలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ అభినవ్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన ననుబోతుల రాజు (25) తండ్రి చనిపోగా తల్లి మల్లక్కతో కలిసి కూలీ పనులకు వెళ్తూ పశువుల కాపరిగా చేస్తున్నాడు.
ఈ నేపథ్యంలో గురువారం రాజు బర్రెలను తోలుకుని దేవుని చెరువు వైపు వెళ్లగా కొన్ని చెరువులో దిగాయి. వాటిని బయటకు పంపించేందుకు వెళ్లిన రాజు నీటిలో పడిపోయాడు. అక్కడే ఉన్న కొందరు గమనించి పోలీసులు, రాజు బంధువులకు సమాచారం ఇచ్చారు. పలువురు ఈతగాళ్లు చెరువులో వెతకగా రాజు మృతదేహం దొరికింది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లిపారు. రాజు మృతి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
Konatham Dileep | రేవంత్ సర్కార్ మరో దౌర్జన్యకాండ.. కొణతం దిలీప్ అక్రమ అరెస్ట్
Jagadish Reddy | అక్రమ అరెస్టులతో ప్రశ్నించే గొంతులను అడ్డుకోలేరు : జగదీష్ రెడ్డి