Vijay Sethupathi – Big Boss Tamil | పాపులర్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ తమిళ్ (Big Boss Tamil) కొన్ని రోజులుగా తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ తమిళ్ అప్‌కమింగ్ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించడం లేదని ఉలగనాయగన్ కమల్ హాసన్ అధికారికంగా ప్రకటించడంతో నెక్ట్స్ ఎవరు ఈ బాధ్యతలు తీసుకోబోతున్నారంటూ ఆసక్తికర చర్చ నడిచింది. అయితే ఈ వార్తలకు చెక్ పెడుతూ.. తాజాగా హోస్ట్‌తో పాటు కొత్త సీజన్ 8కు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను ఇచ్చారు నిర్వహాకులు.
బిగ్ బాస్ సీజన్ 8కి మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి హోస్ట్ గా వ్యవహరిస్తారని విజయ్ టెలివిజన్ ప్రకటించింది. ఈ సందర్భంగా బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్లో విజయ్ హోస్ట్‌గా కనిపిస్తూ అలరిస్తున్నాడు. ఇటీవలే మహారాజతో సూపర్ హిట్ అందుకున్న మక్కళ్ సెల్వన్ ప్రస్తుతం విడుదల పార్ట్ 2తో పాటు గాంధీ టాక్స్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే బిగ్ బాస్‌కి హోస్ట్‌గా విజయ్ చేస్తుండటంతో సేతుపతికి అటు సినిమాలతో పాటు ఇటు బుల్లితెరలో డబుల్ క్రేజ్ వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు సినీ జనాలు.
Also read..