అమరావతి : ఏపీ టీడీపీ కార్యాలయంపై దాడి కేసుల్లో మరో కీలకనేతను పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ ఎమ్మెల్సీగా (YCP MLC) కొనసాగుతున్న లేళ్ల అప్పిరెడ్డి ( Lella Appireddy) బెంగళూరులో ఉన్నంట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకుని మంగళగిరి పోలీసు స్టేషన్‌కు తరలించనున్నారు. ఈ కేసులో వైఎస్సార్సీపీ నేతలు, మాజీ ఎంపీ నందిగం సురేష్, దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్‌తో పాటు పలువురు నాయకులు ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో నందిగం సురేష్‌ను హైదరాబాద్‌లో అరెస్టు చేసి మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.