ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ పెంపుడు కుక్క హ్యాపీ మృతికి ముంబై ఇండియన్స్ జట్టు సంతాపం ప్రకటించింది. గురువారం రాజస్థాన్ రాయల్స్‌పై భారీ విజయం సాధించిన నేపథ్యంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా, కోచ్ మహేల జయవర్దనేను జట్టు యజమాని నీతా అంబానీ అభినందించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఫోన్లో మాట్లాడిన నీత.. కుక్క హ్యాపీ మరణించిన విషయాన్ని జట్టు సభ్యులతో పంచుకుంది.
ఈ సందర్భంగా హ్యాపీని మరింత గుర్తుంచుకునేలా మీరు విజయం సాధించారని పేర్కొంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. గంట వ్యవధిలోనే 3 మిలియన్ల వ్యూస్ సాధించింది. కుక్క హ్యాపీ మృతిపై పలువురు సంతాపం తెలియజేస్తూ సందేశాలు రాసుకొచ్చారు.