IPL 2025 : ప్లే ఆఫ్స్‌కు చేరువలో ఉన్న ముంబై ఇండియన్స్ (Mumbai Indians)కు తదుపరి రెండు మ్యాచ్‌లు చావోరేవో లాంటివి. ఈ రెండింటా జయభేరి మోగిస్తే హార్దిక్ పాండ్యా బృందం దర్జాగా నాకౌట్‌కు దూసుకెళ్లుతుంది. అయితే.. లీగ్ దశ తర్వాత కీలక ఆటగాళ్లు జట్టును వీడనున్న నేపథ్యంలో.. వాళ్లకు సరిసమానమైన ఆటగాళ్లతో తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకుందీ ఫ్రాంచైజీ. ఈ విషయాన్ని మంగళవారం ఫ్రాంచైజీ ఎక్స్ వేదికగా వెల్లడించింది.
ముంబై స్క్వాడ్‌లో కీలకమైన ఆల్‌రౌండర్ విల్ జాక్స్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు రియాన్ రికెల్టన్, పేసర్ కార్బిన్ బాస్చ్లు లీగ్ దశ తర్వాత స్వదేశం వెళ్లనున్నారు. దాంతో, ప్లే ఆఫ్స్ చేరితే వీళ్ల స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు అవసరం. అందుకే.. ముంబై ముందస్తుగానే ఈ ముగ్గురికి ప్రత్యామ్నాయంగా ముగ్గురిని తీసుకుంది. ఇంగ్లండ్ పవర్ హిట్టర్ జానీ బెయిర్‌స్టో(Jonny Bairstow)ను జాక్స్ ప్లేస్‌లో స్క్వాడ్‌లో చేరుతాడని ముంబై తెలిపింది.
📰 𝐌𝐮𝐦𝐛𝐚𝐢 𝐈𝐧𝐝𝐢𝐚𝐧𝐬 𝐬𝐢𝐠𝐧 𝐉𝐨𝐧𝐧𝐲 𝐁𝐚𝐢𝐫𝐬𝐭𝐨𝐰, 𝐂𝐡𝐚𝐫𝐢𝐭𝐡 𝐀𝐬𝐚𝐥𝐚𝐧𝐤𝐚 𝐚𝐧𝐝 𝐑𝐢𝐜𝐡𝐚𝐫𝐝 𝐆𝐥𝐞𝐞𝐬𝐨𝐧 💙
Read more ➡ https://t.co/ElbI4MeVBE#MumbaiIndians #PlayLikeMumbai pic.twitter.com/6vyC8FmW3d
— Mumbai Indians (@mipaltan) May 20, 2025
మెగా వేలంలో అమ్ముడుపోని అతడిని రూ.5.25 కోట్లకు సొంతం చేసుకుంది అంబానీ టీమ్. 2019లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఓపెనర్‌గా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన జానీ.. ముంబైకి లక్కీ హ్యాండ్ అవుతాడని ఫ్రాంచైజీ అనుకుంటోంది. ఇక ఓపెనర్ రియాన్ స్థానంలో శ్రీలంక ఆల్‌రౌండర్ చరిత అసలంకను రూ. 75 లక్షలకు స్క్వాడ్‌లో చేర్చుకుంది ముంబై. సఫారీ పేసర్ కార్బిన్ బాస్చ్ స్థానాన్ని రిచర్డ్ గ్లీసన్‌తో భర్తీ చేస్తున్నట్టు ముంబై ఫ్రాంచైజీ తెలిపింది. ఈ ఇంగ్లండ్ పేసర్‌కు రూ.1 కోటి చెల్లించనున్నట్టు సమాచారం.
ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై.. 18వ ఎడిషన్‌ను ఓటమితో మొదలుపెట్టింది. వరుసగా రెండు పరాజయాల తర్వాత పుంజుకున్న పాండ్యా సేన.. డబుల్ హ్యాట్రిక్ విక్టరీలతో ప్రత్యర్థులకు వణుకు పుట్టించింది. టాపార్డర్‌లో రోహిత్ శర్మ, రియాన్, విల్ జాక్స్ దుమ్మురేపితే.. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కెప్టెన్ పాండ్యా మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగారు. పేస్ యూనిట్‌లోని బుమ్రా, బౌల్ట్, చాహర్‌లు వికెట్ల వేట కొనసాగించడం ముంబైని తిరుగులేని శక్తిగా మలిచాయి.
Wake up, bowl yorkers, dislodge stumps, repeat! 🔥🤌#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #MIvDC pic.twitter.com/Db9u7xz4Wp
— Mumbai Indians (@mipaltan) May 20, 2025
ప్రస్తుతం హార్ధిక్ పాండ్యా బృందం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ముంబైకి ఇంకా రెండు లీగ్ మ్యాచులే బాకీ ఉన్నాయి. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో మే 21న మాజీ ఛాంపియన్ అమీతుమీ తేల్చుకోనుంది. అనంతరం ఇప్పటికే బెర్తు ఖరారు చేసుకున్న పంజాబ్ కింగ్స్‌ను మే 26న ఢీకొట్టనుంది.