IPL 2025 : వాంఖడేలో దంచి కొట్టాలనుకున్న ముంబై ఇండియన్స్ (Mumbai Indians) హిట్టర్లకు షాక్. ఓపెనర్ రోహిత్ శర్మ(5) , డేంజరస్ విల్ జాక్స్(21)లు స్వల్ప స్కోర్‌కే ఔటయ్యారు. ముస్తాఫిజుర్ ఓవర్లో అతడు ఆడిన బంతి ఎడ్జ్ తీసుకొని స్లిప్ దిశగా వెళ్లింది. వికెట్ కీపర్ అభిషేక్ పొరెల్ కుడివైపు డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దాంతో, 23 వద్ద ముంబై తొలి వికెట్ పడింది. ఓపెనర్ రియాన్ రికెల్టన్(22 నాటౌట్) జతగా విల్ జాక్స్ దూకుడుగా ఆడాడు.
ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో లెగ్ సైడ్ జాక్స్ సిక్సర్ బాదగా ముంబై స్కోర్ 40 దాటింది. రెండో వికెట్‌కు 25 రన్స్ జోడించిన జాక్స్‌ను ముకేశ్ పెవిలియన్ పంపాడు. జాక్స్ ఆడిన బంతిని విప్రజ్ పరుగెడుతూ వెళ్లి ఒడిసి పట్టుకున్నాడు. దాంతో, 48 వద్ద ముంబై రెండో వికెట్ కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ 6 పరుగులతో క్రీజులో ఉన్నాడు. పవర్ ప్లేలో ముంబై స్కోర్.. 54-2.
Double delight for #DC ☝️☝️
Mustafizur Rahman and Mukesh Kumar among the wickets 🤝#MI 54/2 after 6 overs. Another SKY special in store? 🤔
Updates ▶ https://t.co/fHZXoEJVed#TATAIPL | #MIvDC | @DelhiCapitals pic.twitter.com/fayglw2EXE
— IndianPremierLeague (@IPL) May 21, 2025
టాస్ ఓడిన ముంబై ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు రోహిత్ శర్మ(5), రియాన్ రికెల్టన్(22 నాటౌట్)లు ధాటిగా మొదలెట్టారు. ముకేశ్ వేసిన తొలి ఓవర్ 5వ బంతిని రోహిత్ మిడాఫ్ దిశగా బౌండరీకి పంపాడు. ఆ తర్వాత చమీరకు చుక్కలు చూపిస్తూ వరుసగా 3, 4 బంతుల్ని స్టాండ్స్‌లోకి పంపాడు రికెల్టన్. దాంతో, ఆ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. అయితే.. 3వ ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ డేంజరస్ హిట్‌మ్యాన్‌ను ఔట్ చేసి ఢిల్లీకి తొలి బ్రేకిచ్చాడు.