Karnataka BJP MLA Munirathna | ముఖంపై మూత్ర విసర్జన చేసి, వైరస్ ఇంజెక్ట్ చేసి రేప్ చేశాడు.. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేపై మహిళ ఆరోపణ
Karnataka BJP MLA Munirathna | కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ముఖంపై మూత్ర విసర్జన చేసి, వైరస్‌ను ఇంజెక్ట్ చేయడంతోపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై (Karnataka BJP MLA Munirathna) ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ముఖంపై మూత్ర విసర్జన చేసి, వైరస్‌ను ఇంజెక్ట్ చేయడంతోపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. దీంతో బీజేపీ ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 40 ఏళ్ల బీజేపీ మహిళా కార్యకర్త బుధవారం బెంగళూరు యశ్వంత్‌పూర్ సమీపంలోని ఆర్ఎంసీ యార్డ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 2023 జూన్ 11న మత్తికెరెలోని బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న కార్యాలయంలో తనపై లైంగిక దాడి జరిగిందని ఆరోపించింది. ఎమ్మెల్యే ఆదేశాలతో తనపై తప్పుగా మోపిన క్రిమినల్ కేసులను కొట్టివేసేందుకు సహాయం చేస్తామని నమ్మించిన ఎమ్మెల్యే అనుచరులు తనను అక్కడకు తీసుకెళ్లారని ఆమె తెలిపింది.
కాగా, బీజేపీ ఎమ్మెల్యే ఆఫీసులోకి ప్రవేశించిన తర్వాత మునిరత్న, ఇద్దరు అనుచరులు తన బట్టలు విప్పారని, తన కొడుకును చంపేస్తామని బెదిరించారని, తనపై అత్యాచారం చేయమని ఇద్దరిని ఆదేశించాడని ఆమె ఆరోపించింది. ఈ సందర్భంగా ఆ ఎమ్మెల్యే తన ముఖంపై మూత్ర విసర్జన చేశాడని తెలిపింది. ఆ తర్వాత గుర్తు తెలియని వ్యక్తి ఆ గదిలోకి వచ్చి మునిరత్నకు ఒక తెల్లటి పెట్టె ఇచ్చాడని, దాని నుంచి సిరంజి తీసి తనకు ఇంజెక్ట్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది.
మరోవైపు ఈ ఏడాది జనవరిలో తాను ఆసుపత్రి పాలయ్యానని ఆ మహిళ తెలిపింది. లైంగిక దాడి సమయంలో చేసిన ఇంజెక్షన్ వల్ల నయం కాని వైరస్ తన శరీరంలో ఉన్నట్లుగా నిర్ధారణ అయ్యిందని చెప్పింది. మే 19న మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించానని, ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లు ఫిర్యాదులో తెలిపింది.
కాగా, బీజేపీ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు ఎమ్మెల్యే మునిరత్న తనపై ద్వేషం పెంచుకున్నాడని ఆ మహిళ ఆరోపించింది. పీన్యా, ఆర్ఎంసీ యార్డ్ పోలీస్ స్టేషన్లలో తనపై తప్పుడు ఫిర్యాదులు చేయించాడని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. దీంతో బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న, అతడి అనుచరులపై సామూహిక లైంగికదాడితోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

