తిరుమలగిరి : సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. మున్సిపాలిటీలోని మొత్తం 15 వార్డులకుగాను బీఆర్ఎస్ పార్టీ ఏడు వార్డుల్లో గెలిచింది. కాంగ్రెస్ పార్టీ మిగిలిన 7 వార్డులను దక్కించుకుంది.
ఇప్పటికే జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజ, సంగారెడ్డి జిల్లాలోని గడ్డిపోతారం, ఇంద్రేశం, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది.