IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ మొదలై వారం రోజులు కావొస్తోంది. స్టార్ ఆటగాళ్లు తమ బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శనతో అభిమానులను అలరిస్తున్నారు. కానీ, ముంబై ఇండియన్స్(Mumbai Indians)ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) మాత్రం ఇంకా మైదానంలోకి దిగలేదు. వెన్నునొప్పితో బాధపడుతున్న ఈ యార్కర్ కింగ్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)లో కోలుకుంటున్నాడు. దాంతో, 18వ సీజన్లో అతడి రాక మరింత ఆలస్యం కానుందని సమాచారం. ఇదే విషయమై శనివారం గుజరాత్ టైటన్స్‌తో మ్యాచ్‌కు ముందు హెడ్‌కోచ్ మహేల జయవర్ధనే(Mahela Jayawardene) మీడియాతో మాట్లాడాడు. బుమ్రా ఆరోగ్యం, ఫిట్నెస్ గురించి ఏం చెప్పాడంటే..
‘ప్రస్తుతం ముంబై స్క్వాడ్‌లో అందరూ అందుబాటులో ఉన్నారు. ఒక్క బుమ్రా తప్ప. నేను ఇంతకుముందు చెప్పినట్టే.. బుమ్రా ఆరోగ్యం రోజురోజుకు మెరుగుపడుతోంది. అయితే.. అతడు ఐపీఎల్ మ్యాచ్‌లకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు అనేది చెప్పలేం. ఎన్సీఏ కూడా ఫలానా రోజూ, తేదీ అని ఏమీ చెప్పలేదు. యార్కర్లు, కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బ్యాటర్లను ఇరుకున పెట్టే ఈ స్పీడ్‌స్టర్ జట్టులో లేకపోవడం పెద్ద లోటే.
Mahela Jayawardene provides an update on Jasprit Bumrah’s recovery.#MJayawardene #Jaspritbumrah #MI #IPL2025 #Insidesport #CricketTwitter pic.twitter.com/XZOIXUuzRh
— InsideSport (@InsideSportIND) March 29, 2025
అయితే.. మాకు అనుభవజ్ఞులైన బౌలింగ్ దళం ఉంది. కానీ, ప్రతి ప్రత్యర్థి, వేదిక.. మా బౌలింగ్ యూనిట్‌కు సవాల్ విసురుతూనే ఉంటాయి. అందుకే.. పిచ్‌ను బట్టి అవసరమైన మార్పులు చేయడంపై దృష్టి పెట్టాం. అనారోగ్యంతో బాధ పడుతున్న అర్జున్ టెండూల్కర్ కోలుకున్నాడు. ఒకవేళ అతడు ఫిట్‌గా ఉంటే.. తుది జట్టులో ఆడిస్తాం’ అని జయవర్ధనే వెల్లడించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్టులో వెన్ను నొప్పితో మైదానం వీడిన బుమ్రా జట్టుకు దూరమయ్యాడు. అప్పట్నుంచీ బెంగళూరులోని ఎన్సీఏలో పునరావాసంలో ఉన్నాడీ స్పీడ్‌స్టర్.
ఐపీఎల్ 18వ సీజన్‌ను ముంబై ఇండియన్స్ ఓటమితో ఆరంభించింది. గత 13 ఎడిషన్లలో మొదటి మ్యాచ్లోపరాజయం పాలవుతూ వస్తోంది ముంబై. తొలి పోరులో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో మ్యాచ్ చేజార్చుకుంది. కీలకమైన ఈ మ్యాచ్‌కు ముందు కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టుతో కలిశాడు. బుమ్రా కూడా ఉండి ఉంటే ముంబౌ బౌలింగ్ యూనిట్ బలం మరింత పెరిగేది. ఎందుకంటే.. ఇన్నింగ్స్ ఆరంభంలో బౌలింగ్ అటాక్‌ను ప్రారంభించి.. పవర్ ప్లేలోనే బ్రేక్ ఇచ్చే యార్కర్ కింగ్ లేనిలోటు తొలి మ్యాచ్‌లోనే కనిపించింది. ప్రస్తుతం ఎన్సీఏలో కోలుకుంటున్న బుమ్రా త్వరగా ఫిట్నెస్ సాధించి జట్టుతో కలవాలని ముంబై ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
I don’t know Jasprit Bumrah will play next match of MI in IPL but I know that whenever he comes back from Injury he will own the IPL and make the whole other franchises scared. So for others be careful when he comes….!!!#JaspritBumrah #IPL2025 pic.twitter.com/k2htV3pZ6g
— MR. PARADOXX (@S77_panther) March 27, 2025