WARANGAL | వరంగల్ చౌరస్తా: సత్యం, మహాత్ముడిపై బురదచల్లే ప్రయత్నాలను భగ్నం చేస్తామని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అన్నారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అధ్యక్షతన రాంకీ ఎన్ క్లేవ్ నిర్వహించిన శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అశాయాలను, భవిష్యత్తు ఆలోచనా విధానాలను ప్రజలకు చేరవేయడానికి సంవత్సరకాలం పాటు కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపట్టనుందని అన్నారు. రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రను స్ఫూర్తిగా తీసుకొని ఏప్రిల్ 2 నుండి 8 రోజుల పాటు మండల స్థాయి కో-ఆర్డినేటర్ల ఆధ్యర్యంలో గ్రామగ్రామంలో ప్రతి ఇంటికి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన సేవలను కాంగ్రెస్ నాయకులు చేసిన ప్రాణ త్యాగాలను, స్వాతంత్రోద్యమకారుల త్యాగాలను వివరించడం జరుగుతుందని అన్నారు.
నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని నర్సంపేట బస్వరాజు శ్రీమాన్, నర్సంపేట టౌన్ గుండేటి నరేందర్, చెన్నారావుపేట జన్ను రవి, దుగ్గొండి గోరంటల రాజు నల్లబెల్లి బిల్ల శ్రీకాంత్, నెక్కొండ కరాటి ప్రభాకర్, ఖానాపురం తత్తరి లక్ష్మణ్ వర్ధన్నపిట నియోజకవర్గం పరిధిలోని వర్ధన్నపేట జనగాం రమేష్, సర్వతగిరి దుబ్బాక సంతోష్, వరంగల్ వజ్ర రాజు, ఖిలా వరంగల్ అకుల రుద్రప్రసాద్, పరకాల నియోజకవర్గం పరిధిలోని గీసుకొండ నరుకుడు వెంకటయ్య, సంగెం మసాని యాకుబ్, పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని పర్వతగిరి ఎండీ అఫ్సర్ లను కార్యక్రమ కో-ఆర్డినేటర్లు గా నియమించడం జరిగినట్లు ఆమె తెలిపారు.
మున్సిపల్ కార్పోరేషన్ పరదిలోని డివిజన్లలో స్థానిక డివిజన్ నాయకుల అధ్యర్యంలో కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంపై జిల్లా కమిటీ నిరంతర పర్యవేక్షణ చేపట్టి రాష్ట్ర కమిటీకి నివేదికను అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గుండేటి నరేందర్, మాజీ కార్పొరేటర్ తత్తరి లక్ష్మణ్ కాంగ్రెస్ జిల్లా నాయకులు బస్వరాజు శ్రీమాన్, కోదాటి అనిల్, జిల్లా యూత్ నాయకులు పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.