Facebook | ఫేస్బుక్ యూజర్లకు శుభవార్త చెప్పింది. కొత్తగా ‘ఫ్రెండ్స్’ ట్యాబ్ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఇందులో ఫ్రెండ్స్ పోస్ట్‌లు, స్టోరీస్, రీల్స్, పుట్టిన రోజు సమాచారం, ఫ్రెండ్స్ రిక్వెస్ట్స్ కనిపిస్తాయి. ఈ ఫీచర్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ‘ఫాలోయింగ్’, క్లోజ్‌ఫ్రెండ్స్’ ఫీచ్ తరహాలోనే పని చేయనున్నది. ఇందులో రెఫర్ చేసిన పోస్టులు మాత్రం కనపడవు. ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ ఫీచర్ వచ్చిన తర్వాత ప్రకటనలు మాత్రం చాలా తక్కువగా కనిపించనున్నాయి. ప్రస్తుతం ‘ఫ్రెండ్స్’ ట్యాబ్ ఫీచర్‌ను తొలుత అమెరికా, కెనడాలో ప్రారంభించినట్లు మెటా కంపెనీ పేర్కొంది. భారత్‌తో సహా ఇతర దేశాల్లో ఎప్పుడు అందుబాటులోకి తీసుకువస్తుందో మాత్రం వెల్లడించలేదు. ఫీచర్ అందుబాటులోకి వస్తే మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్‌గా ఉన్న వ్యక్తుల పోస్టులు మాత్రమే చూడగలుగుతారు.
స్టోరీస్, రీల్స్, బర్త్‌డే రిమైండర్స్ కూడా ఈ ఫీడ్‌లో జోడిస్తారు. అయితే, సజెస్టెడ్ పోస్టులు మాత్రం కనిపించవు. ‘ఫ్రెండ్స్ రిక్వెస్ట్’, ‘పీపుల్ యూ మే నో’ వేర్వేరుగా కనిపిస్తాయి. ఇంతకుముందు ఈ ట్యాబ్ ఫ్రెండ్ రిక్వెస్ట్, సజెస్టెడ్ కనెక్షన్లను మాత్రమే చూపించేది. కానీ, ఇప్పుడు ఇది ఫీడ్ కొత్త వర్టికల్ స్క్రోలింగ్ ఇంటర్ఫేస్ను కలిగి ఉంటుంది. యూజర్లు వారి స్నేహితుల పోస్ట్‌లను మాత్రమే చూడటానికి అనుమతి ఇస్తుంది. మెటా ఇంతకు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఫాలోయింగ్’, ‘క్లోజ్ ఫ్రెండ్స్’ అనే ఫీచర్లను ప్రారంభించింది. ఇందులో యూజర్లు వారిని ఫాలయ్యే వ్యక్తులు, లేదంటే సన్నిహిత స్నేహితుల పోస్టులను మాత్రమే చూడగలుగుతారు. ఫేస్బుక్ కొత్త ‘ఫ్రెండ్స్’ ట్యాబ్ కూడా ఇలాంటి ఫీచరే. ఈ కొత్త ఫీడ్‌లోని పోస్ట్‌లు క్రోనోలాజికల్.. లేదంటే అల్గారిథం ప్రకారం కనిపిస్తాయా? అన్న విషయంలో మెటా క్లారిటీ ఇవ్వలేదు.