IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో బోణీ కోసం ఎదురుచుస్తున్న మాజీ చాంపియన్లు అహ్మదాబాద్‌లో తలపడున్నాయి. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) బౌలింగ్ తీసుకున్నాడు.
తొలి మ్యాచ్‌కు దూరమైన పాండ్యా రాకతో ముంబై ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఇక సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్ చేతిలో కంగుతిన్న శుభ్‌మన్ గిల్ సేన విక్టరీ కొట్టాలనే కసితో ఉంది. ఇరుజట్లు విజయంపై కన్నేయడంతో ఉత్కంఠ పోరు ఖాయం అనిపిస్తోంది. అయితే.. ఈ మైదానంలో గుజరాత్‌పై ముంబై ఒక్కసారి కూడా గెలవలేదు.
ముంబై తుది జట్టు : రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, నమన్ ధిర్, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, సత్యనారాయణ రాజు.
గుజరాత్ తుది జట్టు : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయు సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెఫ్రానే రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిశోర్, కగిసో రబడ, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ.
నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్‌దే ఆధిపత్యం. మూడుసార్లు ముంబైకి ఓటమే ఎదురైంది. ఇప్పటివరకూ రెండు జట్లు 5సార్లు తలపడగా.. గుజరాత్ మూడు విజయాలు సాధించింది. ముంబై రెండు సార్లు గెలిచింది. అంతేకాదు ప్రతిసారి మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ గెలవడం విశేషం.