Wiaan Mulder : సుదీర్ఘ ఫార్మాట్లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డుల హోరును మరవకముందే మరో క్రికెటర్ చరిత్ర సృష్టించాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు వియాన్ మల్డర్ (Wiaan Mulder). జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో మల్డర్ విధ్వంసక బ్యాటింగ్‌తో దడ పుట్టించాడు. దాంతో, సఫారీల తరఫున టెస్టుల్లో అత్యధిక స్కోర్ బాదిన ఆటగాడిగా నిలిచాడు. 367 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. లేదంటే బ్రియాన్ లారా (Brian Lara) పేరిట ఉన్న రికార్డు కనుమరుగయ్యేది.
బులవయాలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్లో ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేసిన మల్డర్.. శతకంతో సంతృప్తి చెందలేదు. ద్విశతకం తర్వాత మరింత రెచ్చిపోయిన సఫారీ సారథి వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా రికార్డుకు చేరువయ్యాడు. అతడి జోరు చూస్తే 11 ఏళ్ల క్రితం ఇంగ్లండ్‌పై లారా 400లతో నెలకొల్పిన స్కోర్ బద్ధలవ్వడం ఖాయం అనిపించింది. క్రికెట్ పండితులు సైతం మల్డర్ అత్యధిక స్కోర్‌తో కొత్త చరిత్ర లిఖిస్తాడని అనుకున్నారు.
We have a surprising twist! Wiaan Mulder has declared South Africa’s innings with him unbeaten on 367, choosing not to chase Brian Lara’s 400* record.#ZIMvSA #WiaanMulder #SouthAfrica pic.twitter.com/3E1mivrzKu
— Circle of Cricket (@circleofcricket) July 7, 2025
కానీ, అతడు మాత్రం అనూహ్యంగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. లేదంటే.. కరీబియన్ లెజెండ్ రికార్డు కనుమరుగయ్యేది. క్రీజులో పాతుకుపోయి జింబాబ్వౌ బౌలర్లకు చుక్కలు చూపించిన మల్డర్ 334 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్సర్లతో 367 పరుగులు సాధించాడు.
బ్రియాన్ లారా (వెస్టిండీస్) – 400 నాటౌట్, 2004లో ఇంగ్లండ్‌పై.
మాథ్యూ హెడెన్(ఆస్ట్రేలియా) – 380 పరుగులు, 2003లో జింబాబ్వేపై.
బ్రియాన్ లారా (వెస్టిండీస్) – 375 పరుగులు, 1994లో ఇంగ్లండ్‌పై.
మహేళ జయవర్దనే(శ్రీలంక) – 374 పరుగులు, 2008లో దక్షిణాఫ్రికాపై.
వియాన్ మల్డర్ (దక్షిణాఫ్రికా) – 367 నాటౌట్, 2025లో జింబాబ్వేపై.