MS Dhoni | భారత క్రికెట్ జట్టు మాజీ సారథి ఎంఎస్ ధోనీ (MS Dhoni) తన విలువైన సమయాన్ని ఫ్యామిలీతో గడుపుతున్నారు. సమయం దొరికనప్పుడల్లా ఫారన్ ట్రిప్‌కు వెళ్తూ.. ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ధోనీ థాయ్‌లాండ్ (Thailand) వెకేషన్‌కు వెళ్లారు.
భార్య సాక్షి, కుమార్తె జీవాతో కలిసి థాయ్‌లాండ్ వెకేషన్‌ను ధోనీ ఎంజాయ్ చేస్తున్నారు. పుకెట్ ఐలాండ్ (Phuket Island)లో ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మహి గారాల పట్టి జీవా సింగ్ ధోనీ (Ziva Singh Dhoni) అధికారిక ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో ధోనీ సముద్రపు నీటిలో సేదతీరుతూ కనిపించారు. మహి గారాలపట్టి ఒడ్డు నుంచి తన తండ్రిని చూస్తూ.. సముద్రపు అలలను ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Also Read..
Champions Trophy 2025 | ‘హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించం’.. తేల్చేసిన పీసీబీ చీఫ్
Natasha Stankovic | ‘నా బిడ్డను వదిలేసి స్వదేశానికా’?.. నటాష కామెంట్స్ వైరల్
Ind-A Vs Aus-A: 6 వికెట్ల తేడాతో నెగ్గిన ఆస్ట్రేలియా-ఏ జట్టు