Champions Trophy 2025 : ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)పై నెలకొన్న అనిశ్చితికి తెరపడడం లేదు. హైబ్రిడ్ మోడల్ (Hybrid Model)లో టోర్నీ జరుగనుందని, భారత జట్టు మ్యాచ్‌లకు దుబాయ్ వేదిక కానుందనే ప్రచారం జోరందుకుంది. దాంతో, చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఒకింత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) స్పందించాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ హైబ్రిడ్ మోడల్లో టోర్నీ జరిపేందుకు అంగీకరించబోమని నఖ్వీ తేల్చిపారేశాడు.
చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును పాకిస్థాన్‌కు పంపబోమని బీసీసీఐ స్పష్టం చేసిందని, టీమిండియా మ్యాచ్‌లకు దుబాయ్ వేదక కానుందని భారత మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దాంతో ఈ వార్తల్లో నిజం లేదని చెప్పేందుకు పీసీబీ చీఫ్ మీడియా ముందుకొచ్చాడు. శనివారం పీసీబీ ఆఫీసులో ఈ విషయంపై స్పష్టత ఇస్తూ నఖ్వీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘గత రెండు నెలల నుంచి చాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు పాకిస్థాన్‌కు టీమిండియా వెళ్లడం లేదు అనే వార్తలు భారత మీడియాలో చాలా వస్తున్నాయి.
🚨 Champions Trophy SAGA 🚨
3 PM – BCCI has informed the Pakistan Cricket Board of its security concerns and requested that India’s matches be held in Dubai instead of Lahore. (Via Indian Media).
4 PM – PCB Chairman Mohsin Naqvi denied that no one from BCCI even approached us. pic.twitter.com/dGQ1Thk68Q
— Ahmad Haseeb (@iamAhmadhaseeb) November 8, 2024
అయితే.. ఈ విషయంపై మా బోర్డు సభ్యులతో నేను మాట్లాడాను. టోర్నీలో పాల్గొనేందుకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాత పూర్వకంగా మాకు సమర్పించాలి అని బీసీసీఐకి ఇప్పటికే మేము స్పష్టం చేశాం. ప్రస్తుతానికైతే హైబ్రిడ్ మోడల్‌పై ఎవరూ చర్చించడం లేదు. మేము హైబ్రిడ్ మోడల్‌కు అస్సలు అంగీకరించం. దుబాయ్‌లో టీమిండియా మ్యాచ్‌లు జరుగుతాయి అనే వార్త భారత మీడియా సృష్టి మాత్రమే. ఎందుకంటే.. ఇప్పటివరకూ అటు ఐసీసీ నుంచిగానీ ఇటు బీసీసీఐ నుంచిగానీ మాకు ఎలాంటి సమాచారం అందలేదు’ అని నఖ్వీ తెలిపాడు.
‘వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు అన్ని జట్టు సుముఖంగా ఉన్నట్టు నఖ్వీ వివరించాడు. చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించిన అన్ని జట్ల బోర్డులతో నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాను. పాకిస్థాన్ వచ్చి టోర్నీలో ఆడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయా బోర్డులు చెప్పాయి. ఎవరైనా ఈ విషయాన్ని రాజకీయం చేస్తారని నేను అనుకోవడం లేదు.
చాంపియన్స్ ట్రోఫీలో ఆడే అన్ని జట్లకు మేము అన్నిరకాల వసతులు కల్పిస్తాం’ అని నఖ్వీ వెల్లడించాడు. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 23న పాకిస్థాన్ గడ్డపై చాంపియన్స్ ట్రోఫీ జరగునుంది. టోర్నీ సమయం దగ్గర పడుతుండడంతో స్టేడియాల మరమ్మతు, సుందరీకరణ పనులను పీసీబీ వేగవంతం చేస్తోంది.