మెల్బోర్న్: ఇండియా-ఏతో జరిగిన అనధికార టెస్టు(Ind-A Vs Aus-A) మ్యాచ్‌లో ఆస్ట్రేలియా-ఏ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకున్నది. వెబ్‌స్టర్ 46, శామ్ కోన్స్టాస్ 73 రన్స్ చేశారు. ఆ ఇద్దరూ అయిదో వికెట్‌కు అజేయంగా 96 రన్స్ జోడించి ఆస్ట్రేలియా జట్టుకు విజయాన్ని అందించారు.
Marcus Harris 🦆
Cameron Bancroft 🦆Prasidh Krishna removes two Test contenders on consecutive balls in the first over #AUSAvINDA pic.twitter.com/5bOOhC7Fqj
— cricket.com.au (@cricketcomau) November 9, 2024
ఇండియా ఏ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 229 రన్స్‌కు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో భారత్ తరపున జురల్ రాణించాడు. అతను రెండు ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. చాలా కూల్‌గా అతను తన బ్యాటింగ్ కొనసాగించాడు. సీనియర్ జట్టుకు అతను ఎంపికయ్యాడు. ఇండియన్ బౌలర్లలో ప్రసిద్ధి కృష్ణ ఒక్కడే రాణించాడు. అతను రెండు ఇన్నింగ్స్‌లో కలిపి ఆరు వికెట్లు తీసుకున్నాడు.
స్కోరు బోర్డు
ఇండియా-ఏ 161 & 229
ఆస్ట్రేలియా-ఏ 223 & 169/4