MS Dhoni : భారత క్రికెట్లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) విజయాలకు కేరాఫ్. మూడు ఐసీసీ ట్రోఫీలతో దిగ్గజ సారథగా పేరొందిన అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువని తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో, ఐపీఎల్ (IPL)లో కెప్టెన్‌గా తన మార్క్ చూపించిన మహీ భాయ్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించాడు. అందుకనే అతడి పేరు వినపడితే చాలు స్టేడియాలు దద్ధరిల్లుతాయి. ఏడో నంబర్ జెర్సీతో ధోనీ మైదానంలోకి వస్తే ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే. తాజాగా కెనడాలోని ఒక అభిమాని టీమిండియా లెజెండ్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు.
తన కారు నంబర్ ప్లేట్‌ను ధోనీ పేరు, అతడి జెర్సీ నంబర్ కలగలిసేలా ఇంగ్లీష్‌లో ‘DHONI 7’ అని రాయించుకున్నాడు. ఇంకేముంది ఆ ఫొటో క్షణాల్లో వైరల్ అయింది. దాంతో, ‘మిస్టర్ కూల్ కెప్టెన్‌గా ప్రశంసలందుకున్న మహేంద్రుడికి విదేశాల్లోనూ అభిమాన గణానికి కొదువ లేదు’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘అభిమానం సరే.. కానీ, ఈ నేమ్ ప్లేట్ కంటపడితే ట్రాఫిక్ పోలీసులు, రవాణా అధికారులు ఊరుకుంటారా?’ అని మరికొందరు ఫన్నీగా ప్రశ్నిస్తున్నారు.
‘Dhoni 7’ number plate in Ontario, Canada.
– The love for MS Dhoni worldwide. ❤️ pic.twitter.com/guG6GDlHuB
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 13, 2024
టీమిండియా సారథిగా మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ధోనీ.. ఐపీఎల్‌లోనూ హిట్ కొట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఐదు ట్రోపీలు అందుకున్నాడు. అయితే.. వయసు పైబడడంతో మహీభాయ్ పదిహేడో సీజన్లో నాయకుడిగా వైదొలిగాడు. యువకెటరం రుతురాజ్ గైక్వాడ్‌కు బాధ్యతలు అప్పజెప్పి ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 42 ఏండ్లకు చేరువైతున్న ధోనీ మరో సీజన్ ఆడుతాడా? రిటైర్మెంట్ ప్రకటించి కొత్త ఇన్నింగ్స్ ఆరంభిస్తాడా? అనేది త్వరలోనే తెలియనుంది.
