DSC Aspirants | ఓయూలో కొనసాగుతోన్న అరెస్టుల పర్వం.. వీడియో
DSC Aspirants | ఉస్మానియా యూనివర్సిటీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను పోలీసులు బలవంతంగా పోలీసు వ్యాన్లనో ఎక్కించి ఓయూ నుంచి తరలిస్తున్నారు.
DSC Aspirants | హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను పోలీసులు బలవంతంగా పోలీసు వ్యాన్లనో ఎక్కించి ఓయూ నుంచి తరలిస్తున్నారు. కనీసం మీడియాతో కూడా మాట్లాడనివ్వకుండా నిరుద్యోగులను పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసుల చర్యలపై నిరుద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు.
డీఎస్సీని మూడు నెలల పాటు వాయిదా వేసి 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని నిరుద్యోగులు గత వారం పది రోజుల నుంచి నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓయూ లైబ్రరీ, ల్యాండ్ స్కేప్ గార్డెన్తో పాటు పలు హాస్టళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కనిపించిన విద్యార్థులను కనిపించినట్టే అరెస్టు చేస్తున్నారు. ఇక ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద శాంతియుత నిరసన తెలిపేందుక వచ్చిన డీఎస్సీ అభ్యర్థులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
డీఎస్సీ ఎగ్జామ్స్‌ను జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు. డీఎస్సీకి సంబంధించిన హాల్ టికెట్లను కూడా అధికారులు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. పలువురు అభ్యర్థులు డీఎస్సీ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని, నిరసనగా నిప్పంటించారు. డీఎస్సీని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మీడియా ముందు నిరుద్యోగులు తమ బాధను చెప్తుంటే అరెస్ట్ చేస్తున్న పోలీస్ pic.twitter.com/VVIKuJSZb7
— Telugu Scribe (@TeluguScribe) July 13, 2024
ఇవి కూడా చదవండి..
షాద్‌నగర్ రియల్టర్ హత్య కేసులో ట్విస్ట్.. పెద్ద కొడుకే అసలు సూత్రధారి!
MLA Arekapudi Gandhi | కాంగ్రెస్ పార్టీలో చేరిన శేరిలింగపల్లి ఎమ్మెల్యే
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

