Mohammed Shami : దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత స్టార్ బౌలర్ (Indian Star Bowler) మహ్మద్ షమీ (Mohammad Shami) అంతర్జాతీయ టీ20 (T20I) మ్యాచ్ ఆడాడు. ఇంగ్లండ్తో మూడో టీ20లో తుది జట్టులో చోటుదక్కించుకున్న షమీ మూడు ఓవర్లు బౌలింగ్ చేసి వికెట్లేమీ తీయలేకపోయాడు. మ్యాచ్లో వికెట్ దక్కకపోయినా షమీ లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) ప్రశంసలు అందుకున్నాడు.
ఎందుకంటే మహ్మద్ షమీ తన రెండో ఓవర్లో అద్భుతమైన ఔట్ స్వింగర్ విసిరాడు. ఆ బంతిని ఎదుర్కొన్న ఇంగ్లండ్ బ్యాటర్ జోస్ బట్లర్ ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఆ సమయంలో కామెంట్రీ బాక్సులో ఉన్న సునీల్ గవాస్కర్.. షమీని ప్రశంసల్లో ముంచెత్తాడు. ‘వారెవ్వా ఆ బంతి చూశారా.. ఎంత అద్భుతంగా పడిందో..’ అంటూ కొనియాడారు. ఈ మ్యాచ్లో భారత్ 26 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయినా ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇండియా 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్నది.
కాగా మహ్మద్ షమీ 2023 టీ20 వరల్డ్కప్ తర్వాత అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడటం ఇదే తొలిసారి. 2023 టీ20 వరల్డ్కప్ ఫైనల్లో గాయం కారణంగా షమీ ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత సర్జరీ చేయించుకుని రెస్ట్ తీసుకున్నాడు. తర్వాత దేశవాలీ క్రికెట్ ఆడి తన ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. దాంతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్ల సిరీస్కు షమీ జట్టులోకి వచ్చాడు. తొలి రెండు మ్యాచ్లలో తుది జట్టులో చోటు దక్కకపోయినా, మూడో మ్యాచ్లో అవకాశం వచ్చింది.
Salwan Momika | 2023లో ముస్లిం దేశాల్లో తీవ్ర ఆందోళనలకు కారణమైన వ్యక్తి దారుణ హత్య..!
Congress MP | మహిళపై నాలుగేళ్లుగా అత్యాచారం.. కాంగ్రెస్ ఎంపీ అరెస్ట్
Chandigarh Mayor | చండీగఢ్ నూతన మేయర్గా హర్ప్రీత్ కౌర్ బబ్లా.. Video
Mahakumbh | తొక్కిసలాట ప్రదేశాన్ని పరిశీలించిన యూపీ సీఎస్, డీజీపీ.. Video
Bomb Threat | శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. నిందితుడు కామారెడ్డి వాసిగా గుర్తింపు