Mohammad Shami : ఈమధ్య కొందరు సెలబ్రిటీలు, క్రికెటర్లను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారు. టీమిండియా కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir)కు ఒక ఆకతాయి ఈమెయిల్ పంపి.. భయపెట్టాలని చూశాడు. తాజాగా భారత జట్టు పేసర్ మహ్మద్ షమీ(Mohammad Shami)కి కూడా బెదిరింపు ఈమెయిల్ ఒకటి వచ్చింది. రూ. 1 కోటి ఇవ్వకుంటే చంపేస్తామని స్పీడ్‌స్టర్‌ను డిమాండ్ చేశాడు ఆ వ్యక్తి.
షమీని భయపెట్టి డబ్బులు రాబట్టాలని చూసిన వ్యక్తి పేరు రాజ్‌పుత్ సింధార్(Rajput Sindhar). అతడు మే 4 ఆదివారం సాయంత్రం సమయంలో ఈమెయిల్ ద్వారా బెదిరిస్తూ రూ. 1 కోటి డిమాండ్ చేశాడు. దాంతో, భయాందోళనకు గురైన షమీ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో, అమ్రోహాలోని పోలీసులు రాజ్‌పుత్‌పై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. సైబర్ సెల్ విభాగం సమన్వయంతో కేసును విచారిస్తున్నపోలీసులు షమీని బెదిరించిన రాజ్‌పుత్‌ను కర్నాటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడిని కస్టడీలోకి తీసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు.
రెండేళ్ల క్రితం వన్డే వరల్డ్ కప్‌లో నిప్పులు చెరిగిన షమీ గాయం కారణంగా ఏడాదికి పైగా ఆటకు దూరమయ్యాడు. ఈమధ్యే ఫిట్నెస్ సాధించిన ఈ స్పీడ్‌స్టర్ ఐపీఎల్ 18వ సీజన్లో తేలిపోతున్నాడు. 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) ప్రధాన పేసర్‌గా పవర్ ప్లేలో వికెట్ల వేట కొనసాగించిన ఈ పేస్ గన్ నిరాశపరుస్తున్నాడు. ఇప్పటివరకూ సన్‌రైజర్స్ హైదారబాద్‌కు ఆడిన 9 మ్యాచుల్లో 8.63 ఎకానమీతో షమీ 6 వికెట్లు తీశాడంతే. అత్యుత్తమ ప్రదర్శన 4-11.
After winning the Purple Cap for GT in his last IPL season, Mohammed Shami looks completely out of form for SRH this season, with just six wickets so far 👀😢#IPL2025 #MohammedShami #GTvSRH #Sportskeeda pic.twitter.com/RtUeZe2ix7
— Sportskeeda (@Sportskeeda) May 2, 2025