Rashmi Gautam | బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ ఆనతి కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె జబర్ధస్త్ షోతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీతో పాటు పలు టీవీషోలతో బిజి బిజీగా ఉంటోంది యాంకర్ రష్మీ. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రష్మీ గౌతమ్ ఇటీవల తాను అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్మీకి ఓ సర్జరీ జరిగింది. భుజం నొప్పి తీవ్రంగా ఉండటంతో రష్మీ సర్జరీ చేయించుకుంది.
అది జరిగిన రెండు నెలలకే రష్మీ మరో సర్జరీ చేయించుకుంది. గర్భాశయంలోని ఫైబ్రాయిడ్లు ఉండడంతో సర్జరీ చేసి వాటిని విజయవంతంగా తీసేశారు అని రష్మీ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. నా హిమోగ్లోబిన్ లెవల్ ఐదు రోజుల్లో 9కి పడిపోయింది. ఈ ఏడాది జనవరి నుంచి నాకు బ్లీడింగ్ ఎక్కువ కావడం, దానికి తోడు భుజం నొప్పి కూడా తోడైంది. మార్చి 29 నుంచి అయితే నా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కమిట్మెంట్లన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేసుకొని ఏప్రిల్ 18న ఆపరేషన్ చేయించేసుకున్నాఅని చెప్పుకొచ్చింది. అయితే రీసెంట్గా బాలి ట్రిప్‌కి వెళ్లినట్టు తెలియజేసింది.
సర్జరీ చేయించుకున్న రష్మీ అలా ఎలా వెళ్లింది అని అందరు అనుకున్నారు. కాని తాను తాజాగా ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 24న బాలి వెకేషన్ కు వెళ్లింది రష్మి. బాలి ట్రిప్ ప్లాన్ రెండు నెలలకు ముందే ఫిక్స్ అయ్యిందట. దీనికి తోడు తన పుట్టిన రోజు కూడా ఉండడంతో అనారోగ్యంతో ఉన్నా ట్రిప్ క్యాన్సిల్ చేయకుండా తప్పక బాలి వెళ్లాల్సి వచ్చిందని రష్మీ తెలిపింది. వెకేషన్ కు వెళ్లినా కూడా నడవలేకపోయిదట. వీల్ ఛైర్ లోనే తిరుగుతూ బాలి ట్రిప్ పూర్తి చేసిందట. ఊయల ఊగడం, జంపింగ్ లు, డైవింగ్ చేయడం, ఇసుకలో ఆడుకోవడం, వాటర్ రైడ్స్ చేయడం, డ్యాన్సింగ్ లాంటివి చేయలేదు. కనీసం చివరకు బీచ్ లో స్నానం కూడా చేయలేకపోయాను అంటూ రష్మీ పేర్కొంది. ఈ ట్రిప్ ఏమో కాని అమ్మ నన్ను జీవితాంతం దెప్పిపొడవడం గ్యారెంటీ అని పేర్కొంది.