Moeen Ali : ఐపీఎల్లో 18 సీజన్ తదుపరి మ్యాచ్‌లకు దూరమయ్యాడు కోల్‌కతా స్పిన్ ఆల్‌రౌండర్ మోయిన్ అలీ (Moeen Ali). కుటుంబసభ్యులకు అనారోగ్యం కారణంగా తిరిగి భారత్‌కు రావడం లేదని చెప్పిన అలీ.. సోమవారం షాకింగ్ విషయాలు పంచుకున్నాడు. భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) సమయంలో తన తల్లిదండ్రులు పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)లో ఉన్నారని తెలిపాడు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ వాళ్లకు ఏమైనా అవుతుందేమోనని చాలా భయపడ్డానని అలీ వెల్లడించాడు.
ఐపీఎల్ మధ్యలోనే స్వదేశం వెళ్లిన మోయిన్ అలీ సోమవారం బియర్ బిఫోర్ వికెట్ పాడ్‌కాస్ట్ షోలో మాట్లాడాడు. ‘భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతల సమయంలో మా తల్లిదండ్రులు పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్నారు. వాళ్లు ఒక గంటలో తిరిగి వస్తారు అనుకుండగా భారత్ ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది. దాంతో, అమ్మానాన్న గురించి నేను కంగారుపడ్డాను.
దేవుడి దయవల్ల వాళ్లు సురక్షితంగా విమానం పట్టుకొని ఇంగ్లండ్ వచ్చేశారు. వాళ్లు క్షేమంగా వచ్చాక ఊపిరి పీల్చుకున్నాను’ అని అలీ వివరించాడు. ఐపీఎల్ వాయిదా పడడానికి ముందే తాను స్వదేశం వెళ్లాలని నిర్ణయించుకున్నాని ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఈ సందర్భంగా చెప్పాడు.
‘ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా మే8న లీగ్ వాయిదా పడింది. నిజం చెప్పాలంటే అంతకంటే ముందే నేను ఇంగ్లండ్ వెళ్లేందుకు సిద్ధమయ్యాను. ఆ సమయంలో నేను, నా కుటుంబసభ్యులు సురక్షితంగా ఉండడమే ప్రధానం అనిపించింది. పైగా అదే టైమ్‌లో నా ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది. వైరల్ ఫీవర్ కారణంగా ఒకటి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాను. ప్రస్తుతం కోలుకున్నాను’ అని అలీ ఐపీఎల్‌కు దూరమవ్వాల్సి వచ్చిన పరిస్థితులను పాడ్‌కాస్ట్ షో వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. 18వ ఎడిషన్‌లో తీవ్రంగా నిరాశపరిచిన అలీ..6 మ్యాచుల్లో 6 వికెట్లు తీశాడంతే.
Moeen Ali has revealed that his parents were stranded in PoK during #OperationSindoorhttps://t.co/ingbnkp27G
— IndiaToday (@IndiaToday) May 19, 2025