చౌటుప్పల్, మే 19 : చౌటుప్పల్ కిరాణం అండ్ జనరల్ స్టోర్స్ ఓనర్స్ అసోసియేషన్ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం సోమవారం స్థానిక కిరాణా అండ్ జనరల్ అసోసియేషన్ భవనంలో జరిగింది. అధ్యక్షుడిగా కామిశెట్టి వెంకటేశం గుప్తా, ప్రధాన కార్యదర్శిగా లింగాల లింగస్వామి గౌడ్, ఉపాధ్యక్షులుగా కైరంకొండ వెంకట నరసయ్య, ఊర కృష్ణమూర్తి గుప్తా, కోశాధికారిగా తడకమల్ల శ్రీనివాస్ గుప్తా, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా గుత్తా సురేందర్ రెడ్డి, బి వీరోజి, సహాయ కార్యదర్శులుగా చల్లా మహేందర్ రెడ్డి, సముద్రాల శ్రీనివాస్ గుప్తా, సంయుక్త కార్యదర్శిగా గోరంటి నరసింహారాజు, కార్యవర్గ సభ్యులుగా ఉప్పల కృష్ణ గుప్తా, ఎర్ర వెంకటేశ్ గౌడ్, గట్టు సాయికిరణ్ గుప్తా, గుడుగుంట్ల వెంకటేశ్, మంచికంటి శంకర్ గుప్తా, గౌరవ అధ్యక్షులుగా ఢిల్లీ శంకర్ రెడ్డి, గౌరవ సలహాదారులుగా వీసం చంద్రారెడ్డి, కామిశేట్టి చంద్రశేఖర్ గుప్తా, గోశిక సత్యనారాయణ, గట్టు ప్రభాకర్ గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు.
అంతకుముందు అసోసియేషన్ భవనంలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, చౌటుప్పల్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ వెన్రెడ్డి రాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, పురపాలిక మాజీ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్, పెద్దిటి బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.