Mitchell Starc : బ్యాటర్లే కాదు మేము కూడా వేగంగా సెంచరీ కొట్టగలం అని నిరూపించాడు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc). స్వదేశంలో పాకిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో నిప్పులు చెరిగిన స్టార్క్.. వంద వికెట్ల క్లబ్లో చేరాడు. సొంతగడ్డపై అత్యంత వేగంగా వికెట్ల సెంచరీ కొట్టేసిన యార్కర్ కింగ్ తమదేశ మాజీ పేసర్ బ్రెట్ లీ (Brett Lee) పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేశాడు.
పాక్ ఆటగాడు సయీం ఆయూబ్ వికెట్ తీసిన స్టార్క్ 54 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయికి చేరుకున్నాడు. దాంతో, 55 ఇన్నింగ్స్‌ల్లో 100 వికెట్లు పడగొట్టిన బ్రెట్ లీ రెండో ర్యాంకుకు పడిపోయాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మెల్బోర్న్ మైదానంలో ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ల మధ్య తొలి వన్డే ఆసాంతం ఉత్కంఠగా సాగింది. మొదట ఆడిన పాక్ 46.4 ఓవర్లలో 203 పరుగులకే కుప్పకూలింది. స్కార్క్ మూడు వికెట్లు తీయగా.. కమిన్స్, జంపాలు రెండేసి వికెట్లు పడగొట్టారు.
The hosts got a W in the first #AUSvPAK ODI at the MCG 👏
SCORECARD: https://t.co/PjtHZTwBUJ pic.twitter.com/TbgjQZKllT
— ESPNcricinfo (@ESPNcricinfo) November 4, 2024
ఛేదనలో వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్(49), స్టీవ్ స్మిత్(44)లు మాత్రమే రాణంచగా.. మిడిలార్డర్ విఫలమైంది. 185 పరుగులకే 8 వికెట్లు పడిన దశలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్(32 నాటౌట్) బ్యాట్‌కు పనిచెప్పాడు. స్టార్క్‌తో కలిసి 19 పరుగులు జోడించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దాంతో, మూడు వన్డేల సిరీస్‌లో ఆసీస్ 1-0తో ఆధిక్యం సాధించింది. ఇరుజట్ల మధ్య కీలకమైన రెండో మ్యాచ్ నవంబర్ 8న అడిలైడ్ ఓవల్ మైదానంలో జరుగనుంది.