మౌంట్ మంగనుయి(న్యూజిలాండ్): న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-0తో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన మూడో టీ20 పోరులో ఆసీస్ 3 వికెట్ల తేడాతో కివీస్‌పై ఘన విజయం సాధించింది.
కివీస్ నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని కంగారూలు 18 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. కెప్టెన్ మిచెల్ మార్ష్(52 బంతుల్లో 103 నాటౌట్, 8 ఫోర్లు, 7సిక్స్‌లు) అజేయ సెంచరీతో జట్టు విజయంలో కీలకమయ్యాడు.తొలుత సిఫర్ట్(48), బ్రాస్‌వెల్(26) రాణించడంతో కివీస్ 20 ఓవర్లలో 156/9 స్కోరు చేసింది. అబాట్(3/25),బార్ట్లెట్(2/25) రాణించారు.