Mitchell Marsh : ఆస్ట్రేలియా విధ్వంసక ఆటగాడు మిచెల్ మార్ష్(Mitchell Marsh) కెప్టెన్సీపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. జట్టుకు తన అవసరం ఉన్నన్ని రోజులు సారథిగా కొనసాగుతానని అన్నాడు. అయితే.. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins) గాయపడడంతో మార్ష్‌కు వన్డే పగ్గాలు కూడా అప్పగించారు. ‘ఈ ఏడాది నాకు చాలా అద్భుతంగా ఉంది. పెళ్లి చేసుకున్నా. ఆ వెంటనే టెస్టు జట్టులో చోటు సంపాదించా. అంతలోనే టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాను.
త్వరలోనే దక్షిణాఫ్రికా పర్యటన(South Africa Tour) ఉంది. వన్డే వలర్డ్ కప్ ముందు సఫారీ గడ్డపై మా జట్టు ఎలా ఆడనుంది? అనేది కీలకం కానుంది. అయితే.. జట్టుకు నా అవసరం ఉన్నన్ని రోజులు కెప్టెన్‌గా ఉంటా. ఈ కొత్త ప్రయాణం ఎక్కడ ముగుస్తుందో చూడాలి. నేను గొప్ప సారథి అనుకుంటున్నా. అలానిరూపించుకోని రోజు కెప్టెన్‌గా తప్పుకుంటా’ అని మార్ష్ వెల్లడించాడు.
యాషెస్ సిరీస్‌లో సెంచరీ బాదిన మార్ష్
కొంత కాలంగా మార్ష్ నిలకడగా రాణిస్తున్నాడు. ఇంగ్లండ్‌పై యాషెస్ సిరీస్ మెరపు సెంచరీతో సత్తా చాటాడు. ముఖ్యంగా టీ20ల్లో దుమ్మురేపుతున్న అతడు ఆగస్టు 7న పొట్టి ఫార్మాట్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇది అతడి కెరీర్లో పెద్ద మైలురాయి అనే చెప్పాలి. వచ్చే ఏడాది పొట్టి ప్రపంచ కప్ వరకూ మార్ష్ సారథిగా కొనసాగే అవకాశం ఉంది. కంగారు జట్టు ఆగస్టులో చివర్లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ మూడు టీ20లు, ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది.