Mirabai Chanu : పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను (Mirabai Chanu) తృటిలో పతకం కోల్పోయింది. 49 కిలోల విభాగంలో ఆమె ఒక్క కిలో తేడాతో కాంస్య పతకా(Bronze Medal)న్ని చేజార్చుకుంది. బుధవారం జరిగిన పోటీల్లో మీరా 4వ స్థానంతో సరిపెట్టుకుంది. అయితే.. విశ్వ క్రీడల్లో మెడల్ కోసం ఆమె నెలసరి (Periods) నొప్పిని భరించింది. పీరియడ్స్ కారణంగా అత్యుత్తమ ప్రదర్శన చేయలేకపోయింది. ఈ విషయాన్నితాజాగా మీరా వెల్లడించింది.
‘వెయిట్‌లిఫ్టింగ్ పోటీల సమయంలో నాకు నెలసరి మూడో రోజు. దాంతో, కొంచెం బలహీనంగా మారాను. పీరియడ్ ప్రభావం నా ప్రదర్శనపై పడింది. అయితే.. పారిస్‌లో నా ఆట పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే.. గాయం నుంచి కోలుకుని ఒలింపిక్స్‌లో నా శక్తిమేరకు పోరాడాను’ అని మీరాబాయి తెలిపింది.
Mirabai Chanu said, “I’m on the third day of my periods. Had weakness. This affected my game. I gave my best, but it wasn’t my day”. (Revsportz). pic.twitter.com/tREfbE4rpN
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 8, 2024
టోక్యో ఒలింపిక్స్‌లో కంచు మోత మోగించిన మీరా ఈసారి కూడా పతకం కొల్లగొట్టేలా కనిపించింది. కానీ, 199 కిలోల బరువు ఎత్తి నాలుగో స్థానంలో నిలిచింది. ఆమెకంటే ఒకే ఒక కిలో ఎక్కువ వెయిట్ మోసిన సురోడ్చన ఖంబావో(థాయ్‌లాండ్) కాంస్యాన్ని ఎగరేసుకుపోయింది. తద్వారా విశ్వ క్రీడల్లో వరుసగా రెండోసారి మెడల్ సాధించాలనుకున్న మీరా కల చెదిరింది.