అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఆటవిక రాజ్యం కొనసాగుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ( Ambati Rambabu ) ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ (Red book) రాజ్యాంగం అమలవుతోందని విరుచుకుపడ్డారు, శాంతి భద్రతలు (Law and Order) పూర్తిగా పడిపోయాయని ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నట్టా? లేనట్టా? అని అనుమానం వ్యక్తం చేశారు.
రాష్ట్రాన్ని బీహార్(Bihar ), మణిపూర్ లాగ మార్చారని విమర్శించారు. ఒంటేరు నాగరాజు అనే వైసీపీ కార్యకర్తని కిడ్నాప్ చేయడంతో ప్రాణభయంతో వినుకొండ వచ్చారని తెలిపారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పని చేస్తోందా? అని ప్రశ్నించారు. నాగరాజుకు ఏ విధమైన హాని జరిగినా సీఎం చంద్రబాబు (Chandra Babu) బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
నడిరోడ్డు మీద హత్యలు, కిడ్నాప్‌లు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని అన్నారు. టీడీపీ నేతలు ఏం చేసినా పోలీసులు వారిని ఏమీ అనటానికి వీల్లేదని హోంమంత్రి నుంచే ఆదేశాలు వెళ్లాయని పేర్కొన్నారు. పోలీసులు వెంటనే స్పందించి నాగరాజును కాపాడాలని డిమాండ్ చేశారు.
Prakasam barrage | ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద.. 70 గేట్లు ఎత్తివేత
MLA Ganta Srinivasrao | కూటమి గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవడం ఖాయం : ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు