Kumara Devaram Chettu | గోదావరి నది వరద ఉధృతికి సినిమా చెట్టు (కుమారదేవం చెట్టు) ఇటీవల నేలకొరిగిన విషయం తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో గోదావరి నది తీరాన ఉన్న 150 సంవత్సరాల చరిత్ర కలిగిన గన్నేరు చెట్టు ఇది.
టాలీవుడ్లో దాదాపు 300కి పైగా సినిమాలు ఈ చెట్టు కింద షూటింగ్ జరుపుకున్నాయని.. దిగ్గజ దర్శకులు వంశీ, కె విశ్వనాథ్, జంధ్యాల, బాపు, రాఘవేంద్ర రావు తమ సినిమాల్లో ఈ చెట్టుని వాడినట్లు స్థానికులు చెబుతుంటారు. చివరిగా ఇక్కడ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ ఇక్కడ జరుపుకున్నట్లు సమాచారం. చాలా సినిమాలను ఈ చెట్టు కింద తీయడం వలన దీనిని సినిమా చెట్టు అంటారని.. నిర్మాతలకు, దర్శకులకు వారి సినిమాలో ఈ చెట్టును చూపించినట్లయితే ఆ సినిమా విజయం సాధిస్తుందని అప్పట్లో నమ్మకం ఉండేదని సమాచారం. అయితే ఈ చెట్టు కూలిపోవడంతో కుమారదేవం ప్రజలతో పాటు సినీ ప్రియులు ఆవేదన చెందుతున్నారు. ఆధునిక పద్ధతులను ఉపయోగించి చెట్టుని ఎలాగైనా బ్రతికించండి అంటూ ఏపీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ఇక దర్శకుడు వంశీకి అయితే ఈ చెట్టుతో ప్రత్యేక అనుబంధం ఉంది. చిన్నప్పుడు ఇక్కడే వంశీ అడుకునేవాడని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే తాజాగా ఈ చెట్టు కూలిన విషయాన్ని తెలుసుకున్న దర్శకుడు వంశీ చెట్టుని సందర్శించాడు. గోదావరి వరద ఉధృతికి చెట్టు కూలిపోవడంతో వంశీ బోరుమని ఏడ్చినట్లు సమాచారం. అయితే తాను చెట్టు చివరచూపు కోసం ఇక్కడికి వచ్చానని చెట్టు కూలిపోవడం చాలా బాధగా ఉందని వంశీ తెలిపాడు.
చెట్టు లేదని తెలిసి తన సొంత తల్లి కాలం చేసినట్టు ఏడుస్తున్నానని ఆవేదన వ్యక్తపరిచిన #వంశీ గారు కుమారదేవం సినిమా చెట్టు చివరి చూపు కోసం అక్కడి వెళ్ళారు.
Cinema Chettu 🙏 pic.twitter.com/0e26XG4h6i
— Rajesh Manne (@rajeshmanne1) August 8, 2024
కుమారదేవం సినిమా చెట్టు ఇక నుంచి ఒక చరిత్ర..
ఈ తెల్లవారుజామున గోదావరి వరదతో చెట్టు కూలిపోయింది.
కొవ్వూరు మండలం తాళ్ళపూడి దగ్గర్లోని కుమారదేవం గ్రామంలో ఈ నిద్ర గన్నేరుచెట్టును గోదారితల్లి ఒడ్డున నాటారు మహానుభావుడు శ్రీ సింగలూరి తాతబ్బాయి గారు… ఎన్నో వరదల్నీ… pic.twitter.com/5Q34GPNAOj
— Vivace Media (@VivaceMedia) August 6, 2024
Also Read..