NTR Neel | జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటిస్తోన్న దేవర షూటింగ్ దశలో ఉందని తెలిసిందే. ఈ మూవీ పార్టు 1 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీ విడుదల కాకముందే ఎన్టీఆర్ 31 (NTR 31) సెట్స్‌పైకి వెళ్లనుందని వార్తలు ఇండస్ట్రీ సర్కిల్లో ఇప్పటికే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రశాంత్ నీల్ (PrashanthNeel) డైరెక్షన్లో రాబోతున్న ఎన్టీఆర్ 31 సినిమా లాంచింగ్ సెర్మనీ ఆగస్టు 9న జరుగనుంది.
ఇప్పుడు మరో అప్డేట్ టాలీవుడ్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. తాజా వార్తల ప్రకారం రేపు ఎన్టీఆర్ 31 ప్రారంభ కార్యక్రమం సాదాసీదాగా జరుగనుందట. అంతేకాదు ఈవెంట్‌కు మీడియా కవరేజ్ కూడా లేదని తెలుస్తోంది. పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత ప్రొడక్షన్ టీం నుంచి ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలు బయటకు రానున్నాయని ఫిలిం నగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్.
ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌కు డ్రాగన్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తుండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే సలార్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్ ఈ ప్రాంచైజీ ప్రాజెక్ట్ సీక్వెల్ సలార్ 2 పనులతో బిజీగా ఉన్నాడు. మరోవైపు తారక్ కూడా దేవర, వార్ 2 సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ షెడ్యూల్‌ను బట్టి ఎన్టీఆర్ 31 రెగ్యులర్ షూటింగ్‌పై క్లారిటీ వచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
SJ Suryah | సరిపోదా శనివారంలో నాని పాత్ర ఇదే.. ఎస్జే సూర్య కామెంట్స్ వైరల్
Naga Chaitanya | శోభితా ధూళిపాళకు స్వాగతం.. నాగచైతన్య నిశ్చితార్థంపై నాగార్జున
Fahadh Faasil | ఇంతకీ ఫహద్ ఫాసిల్ ఎవరికి హాయ్ చెప్తున్నాడో..? తలైవా వెట్టైయాన్ లుక్ వైరల్
Rashmika Mandanna | మరాఠి భాషపై కన్నడ భామ రష్మిక మందన్నా ఫోకస్.. ఎందుకో తెలుసా..?