న్యూఢిల్లీ: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2024ను ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టారు. దీనిపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(MP Asaduddin Owaisi) మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 25 సూత్రాలను బిల్లు ఉల్లంఘిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. బిల్లు వివక్షతో కూడుకున్నదని, ఏకపక్షంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. వక్ఫ్ బోర్డ సవరణ బిల్లుతో.. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని విభజిస్తోందన్నారు. ముస్లింలకు మీరు శత్రువు అని చెప్పేందుకు ఈ బిల్లే సాక్ష్యమని ఎంపీ అసద్ పేర్కొన్నారు.
#WATCH | On Waqf (Amendment) Bill, 2024, AIMIM MP Asaduddin Owaisi says, “This bill violates the principles of Articles 14, 15 and 25 of the Constitution. This bill is both discriminatory and arbitrary…By bringing this bill, you (the Central govt) are doing the work of… pic.twitter.com/kehmLjV3Gv
— ANI (@ANI) August 8, 2024