Michael Vaughan | ఐపీఎల్ విజేత ఆర్సీబీనే.. ఇంగ్లండ్ స్టార్ జోస్యం ఫలించేనా..?
Michael Vaughan : ఐపీఎల్ సీజన్ ఆరంభం నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్టు ట్రోఫీ కోసం నిరీక్షిస్తోంది. 16 ఏండ్లలో మూడుసార్లు ఫైనల్ చేరినా ఒక్కసారి కూడా ఆ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందని ద్రాక్షగానే మిగిలింది. మరోవైపు మహిళల ప్రీమియర్ లీగ్(WPL 2024)లో ఆ జట్టు రెండో సీజన్లో విజేతగా...
Michael Vaughan : ఐపీఎల్ సీజన్ ఆరంభం నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్టు ట్రోఫీ కోసం నిరీక్షిస్తోంది. 16 ఏండ్లలో మూడుసార్లు ఫైనల్ చేరినా ఒక్కసారి కూడా ఆ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందని ద్రాక్షగానే మిగిలింది. మరోవైపు మహిళల ప్రీమియర్ లీగ్(WPL 2024)లో ఆ జట్టు రెండో సీజన్లో విజేతగా అవతరించింది. ‘ఈ సాలా కప్పు నమ్దూ’ స్ఫూర్తితో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి టైటిల్‌ను సగర్వంగా ముద్దాడింది.
దాంతో, ఈసారి ఆర్సీబీ అబ్బాయిలు కూడా ట్రోఫీ గెలుస్తారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్(Michael Vaughan ) సైతం బెంగళూరు కప్పు కొడుతుందని జోస్యం పలికాడు. ‘అద్భుతమైన టోర్నమెంట్. ఆర్సీబీకి దక్కాల్సిన విజయమిది. ఇక అబ్బాయిలు కూడా ఆర్సీబీ ట్రోఫీని డబుల్ చేస్తారా. ఈ ఏడాది ఆర్సీబీదే’ అని వైన్ ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు. ఇంగ్లండ్ దిగ్గజం వాన్ మాట నిజమైతే బాగుండని బెంగళూరు అభిమనులు కోరుకుంటున్నారు. ఐపీఎల్లో ఆర్సీబీ 2009, 2011, 2016లో ఫైనల్‌కు దూసుకెళ్లినా ట్రోఫీ గెలవలేదు.
Fantastic tournament .. Well deserved win for @RCBTweets !! Now can the Men do the double !!! This could be the year … https://t.co/1yjDWD3wFo
— Michael Vaughan (@MichaelVaughan) March 17, 2024
నిరుడు విరాట్ కోహ్లీ , డూప్లెసిస్, మ్యాక్స్‌వెల్‌లు మాత్రమే రాణించడంతో ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది. ఈసారి కామెరూన్ గ్రీన్, పేసర్ అల్జారీ జోసెఫ్‌ల రాకతో బెంగళూరు బలంగా కనిపిస్తోంది. ఫైనల్ చేరిన తొలిసారే అమ్మాయిలు ట్రోఫీ గెలవడంతో అబ్బాయిలు సైతం కప్పు కొట్టాలనే కసితో ఉన్నారు. ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22న ఆరంభం కానుంది. తొలిపోరులో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆర్సీబీ తలపడనుంది.
Boys are ready to win their first IPL title ✅ pic.twitter.com/RXgqoJII8h
— Pritam Pandey ✌️ (@ViratFan100) March 17, 2024
ఒకే ఓవర్లో 3 వికెట్లు
మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఒక్కసారి కూడా ఢిల్లీపై గెలవని ఆర్సీబీ ఫైనల్లో అద్భుతం చేసింది. స్పిన్నర్ సోఫీ మొలినెక్స్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి ఢిల్లీని దెబ్బకొట్టగా.. శ్రేయాంక పాటిల్ సూపర్ స్పెల్‌తో రాణించింది. అనంతరం 113 పరుగుల ఛేదనలో ఆర్సీబీ ఓపెనర్లు స్మృతి మంధాన(31), సోఫీ డెవిన్(32)లు దంచికొట్టారు.
That Trophy-Lifting Moment! 🙌 🙌
Royal Challengers Bangalore captain Smriti Mandhana receives the #TATAWPL Trophy 🏆 from the hands of Mr Roger Binny, President, BCCI and Mr Jay Shah, Honorary Secretary, BCCI 👏 👏#Final | @JayShah | @RCBTweets | @mandhana_smriti pic.twitter.com/pYrNYkZdca
— Women’s Premier League (WPL) (@wplt20) March 17, 2024
వీళ్లిద్దరూ ఔటయ్యాక ఎలీసె పెర్రీ(35 నాటౌట్), రీచా ఘోష్(17 నాటౌట్)లు ధనాధన్ ఆడి బెంగళూరు ట్రోఫీ బెంగ తీర్చారు. 19.3 ఓవర్లో రీచా బౌండరీ కొట్టడంతో ఆర్సీబీ తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. దాంతో, నిరుడు రన్నరప్‌తో సరిపెట్టుకున్న ఢిల్లీకి మరోసారి నిరాశే మిగిలింది.
ఇవి కూడా చదవండి
- Indian Wells 2024 | చరిత్ర సృష్టించిన అల్కరాజ్.. రెండో ట్రోఫీ గెలుపొందిన స్వియాటెక్
- SSC Exams | ప్రారంభమైన పది పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతించిన అధికారులు..
- Kanguva | సూర్య కంగువ క్రేజీ టీజర్ లోడింగ్.. టైం ఫిక్స్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

