SSC Exams | ప్రారంభమైన పది పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతించిన అధికారులు..
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు (SSC Exams) ప్రారంభమయ్యాయి. పరీక్ష ప్రారంభమైన ఐదు నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అధికారులు అనుమతించారు.
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు (SSC Exams) ప్రారంభమయ్యాయి. పరీక్ష ప్రారంభమైన ఐదు నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అధికారులు అనుమతించారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే విద్యార్థులను పరీక్ష కేంద్రంలో పంపించారు. ఏప్రిల్ 2 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 5.05 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించింది.
కాగా, పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఏప్రిల్ 3 నుంచి 11 వరకు నిర్వహిస్తారు. మొత్తంగా 9 రోజులపాటు స్పాట్ వాల్యుయేషన్ను నిర్వహించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 19 స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మార్చి 23న వాల్యుయేషన్ సిబ్బందికి ఓరియంటేషన్ను నిర్వహిస్తామని తెలిపారు. 11 పేపర్ల నుంచి 6 పేపర్లకు కుదించడంతో జవాబు పత్రాల సంఖ్య తగ్గనున్నది. దీంతో మూల్యాంకనాన్ని త్వరగా పూర్తిచేసి, ఫలితాలను త్వరగా విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.











Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

