Game Changer | టాలీవుడ్ స్టార్ యాక్టర్ రాంచరణ్ (Ram Charan) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం గేమ్‌ఛేంజర్ (Game changer). స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. శంకర్ తన కూతురు వెడ్డింగ్ నేపథ్యంలో షూటింగ్‌కు విరామం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది.
నేడు గేమ్ ఛేంజర్ కీలక షెడ్యూల్ పూర్తయింది. సునీల్, నవీన్ చంద్ర, రాంచరణ్‌పై వచ్చే సన్నివేశాలను చిత్రీకరించినట్టు ఇన్సైడ్ టాక్. అంతేకాదు కొత్త షెడ్యూల్‌ను మే 1 నుంచి చెన్నైలో మొదలుపెట్టనున్నారని సమాచారం. ఈ షెడ్యూల్లో యాక్షన్ ఎపిసోడ్స్‌ను చిత్రీకరించనున్నారట.
ఈ చిత్రంలో రాజోలు సుందరి అంజలి, టాలీవుడ్ యాక్టర్లు నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్లర్లు ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరాయ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు.
గేమ్ ఛేంజర్‌కు పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.