T20 World Cup | న్యూజిలాండ్ ప్రపంచకప్ స్క్వాడ్.. స్టార్ పేసర్‌కు పిలుపు
T20 World Cup : న్యూజిలాండ్ క్రికెట్ సోమవారం టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2024) స్క్వాడ్‌ను ప్రకటించింది. 15 మందితో కూడిన బలమైన బృందాన్ని ఎంపిక చేసింది. స్టార్ పేసర్ మ్యాట్ హెన్రీ(Matt Henry) తొలిసారి పొట్టి ప్రపంచకప్ జట్టులోకి వచ్చాడు.
T20 World Cup : న్యూజిలాండ్ క్రికెట్ సోమవారం టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2024) స్క్వాడ్‌ను ప్రకటించింది. 15 మందితో కూడిన బలమైన బృందాన్ని ఎంపిక చేసింది. కేన్ విలియమ్సన్ (Kane Williamson) కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. పేసర్ మ్యాట్ హెన్రీ(Matt Henry) తొలిసారి పొట్టి ప్రపంచకప్ జట్టులోకి వచ్చాడు.
బెన్ సియర్స్ ట్రావెలింగ్ రిజర్వ్‌గా చోటు దక్కించుకున్నాడు. టీ20 ఫార్మాట్లో మ్యాట్ హెన్రీ అద్బుతంగా రాణిస్తున్నాడు. దాంతో, అతడిని వరల్డ్ కప్ జట్టులోకి తీసుకున్నాం అని హెడ్‌కోచ్ గ్యారీ స్టీడ్ అన్నాడు. కివీస్ సెలెక్టర్లు ఎంపిక చేసిన 15 మందిలో ఇంకా ఎవరెవరు ఉన్నారంటే..?
Our squad for the @t20worldcup in the West Indies and USA in June 🏏
MORE | https://t.co/a8cLkEjSDH #T20WorldCup pic.twitter.com/OUwHjEdaPn
— BLACKCAPS (@BLACKCAPS) April 29, 2024
న్యూజిలాండ్ స్క్వాడ్ : కేన్ విలియమ్సన్(కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రాస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లూకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిఫ్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధీ, టిమ్ సౌథీ, ట్రావెలింగ్ రిజర్వ్ – బెన్ సియర్స్.
Frames from today’s @t20worldcup squad announcement in Auckland 🏏 #T20WorldCup pic.twitter.com/vHJdDCvmqD
— BLACKCAPS (@BLACKCAPS) April 29, 2024
పేస్ ఆల్‌రౌండర్లు వీళ్లే
టిమ్ సౌథీకి ఇది ఏడో వరల్డ్ కప్ కాగా.. బౌల్ట్‌కు ఐదో మెగా టోర్నీ కావడం విశేషం. భారత పర్యటనలో ఉప్పల్ స్టేడియంలో సెంచరీతో చెలరేగిన బ్రాస్‌వెల్ పాకిస్థాన్ పర్యటనలో సారథిగా టీ20 సిరీస్ సమం చేశాడు. దాంతో, సెలెక్టర్లు అతడిని వరల్డ్ కప్ స్క్వాడ్‌లోకి తీసుకున్నారు. ఇక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా జిమ్మీ నీషమ్, డారిల్ మిచెల్‌లు ఎంపికయ్యారు. అమెరికా, వెస్సిండీస్ స్లో పిచ్‌లపై కుర్రాళ్లు రవీంద్ర, చాప్మన్, ఫిలిఫ్స్లు బ్యాటుతో, బంతితో చెలరేగుతారని సెలెక్టర్లు నమ్మతున్నారు.

జూన్ 1వ తేదీన
వన్డే వరల్డ్ కప్ ముగియడంతో మరో ఐసీసీ ట్రోఫీ సమరానికి అన్ని జట్టు సన్నాహకాలు మొదలెట్టాయి. అమెరికా, వెస్టిండీస్ అతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ పోటీలు జూన్ 1వ తేదీన షురూ కానున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని దేశాల సెలెక్టర్లు తుది స్క్వాడ్ ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఐపీఎల్ 17వ సీజన్ ముగిసే లోపు టీమిండియా స్క్వాడ్ కూడా ఫైనల్ కానుంది.
25 years on. A new chapter 🏏 #T20WorldCup pic.twitter.com/Z7xhPBOTcq
— BLACKCAPS (@BLACKCAPS) April 29, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

