Srinagar | 26 ఏండ్ల తర్వాత.. శ్రీనగర్లో అత్యధికంగా 36.58 శాతం పోలింగ్ నమోదు
Srinagar | శ్రీనగర్ లోక్సభ నియోజకవర్గంలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 36.58 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
Srinagar | న్యూఢిల్లీ : శ్రీనగర్ లోక్సభ నియోజకవర్గంలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 36.58 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం 1998 తర్వాత ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.
శ్రీనగర్ పార్లమెంట్ స్థానానికి 24 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి 12 మంది పోటీ చేశారు. చదూరా, చాహ్ ఐ షరీఫ్, గందర్బల్, కంగన్, ఖాన్సాహిబ్, సోఫియాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో 45 శాతం కంటే ఎక్కువ పోలింగ్ నమోదైంది. బుద్గాం, గందర్బల్, పుల్వామా, సోఫియాన్ నియోజకవర్గాల్లో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదు.
చివరిసారి 1996లో 40.94 శాతం పోలింగ్ నమోదు కాగా, మళ్లీ ఇప్పుడు 36.58 శాతం పోలింగ్ నమోదైంది. 1998లో 30.06 శాతం, 1999లో 11.93 శాతం, 2004లో 18.57 శాతం, 2009లో 25.55 శాతం, 2014లో 25.86 శాతం, 2019లో 14.43 శాతం పోలింగ్ నమోదైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

