IPL | ఢిల్లీ: మార్చి మాసాంతం నుంచి జరుగుతున్న ఐపీఎల్-17లో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా వీడ్కోలు పలుకుతున్నారు. త్వరలో మొదలుకాబోయే టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా ఇంగ్లండ్.. పాకిస్థాన్‌తో టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఈ సీజన్‌కు గుడ్‌బై చెబుతున్నారు.
శనివారమే లివింగ్‌స్టొన్ (పంజాబ్) లండన్‌కు వెళ్లిపోగా సోమవారం జోస్ బట్లర్ (రాజస్థాన్), విల్ జాక్స్, రీస్ టాప్లీ (బెంగళూరు) కూడా యూకే ఫ్లైట్ ఎక్కేశారు. కేకేఆర్ ఓపెనర్ ఫిల్ సాల్ట్, చెన్నై ఆల్‌రౌండర్ మోయిన్ అలీ కూడా రేపో మాపో ఇంగ్లండ్‌కు వెళ్లనున్నారు. ప్లేఆఫ్స్‌కు చేరే ఫ్రాంచైజీలు ఇంగ్లండ్ ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగనున్నాయి.