Loksabha Elections 2024 : ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి అధికారం నుంచి వైదొలగుతారని బీజేపీకి కూడా అర్ధమైందని అన్నారు. 400 స్ధానాలు పైగా గెలుచుకుంటామంటే ప్రధాని మోదీ రోజూ 400కిపైగా అసత్యాలు మాట్లాడతారని అర్ధమని ఏఐసీసీ ఒడిషా ఇన్చార్జ్ డాక్టర్ అజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. మోదీ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా చౌకబారు అంశాలను లేవనెత్తుతారని అన్నారు.
లోక్సభ ఎన్నికల్లో కాషాయ కూటమికి ఘోర పరాజయం తప్పదని అన్నారు. భువనేశ్వర్లో అజయ్ కుమార్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మోదీని సాగనంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని అంతకుముందు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ చెప్పారు.
మోదీ ప్రధాని పదవి నుంచి దిగిపోనున్నారు..ఆయనకు మరోసారి ప్రజా తీర్పు అనుకూలంగా రాదని స్పష్టం చేశారు. తొలి రెండు దశల పోలింగ్ అనంతరం బీజేపీ దక్షిణాదిలో సాఫ్ అవుతుందని, ఉత్తరాది, పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో సగానికి పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. ప్రజా సమస్యలు, వాస్తవ అంశాల నుంచి ప్రధాని మోదీ పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల్లో అసంతృప్తి గూడుకట్టుకుని ఉందని, మోదీ పాలనతో వేసారిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు.
Read More :
KCR | కేంద్రంలో ప్రాంతీయ పార్టీలదే పెత్తనం: కేసీఆర్