KCR | సిద్దిపేట/సిద్దిపేటరూరల్, మే 13: లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని ప్రాంతీయ పార్టీలదే పెత్తనం నడుస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలంలోని చింతమడకలో సోమవారం కేసీఆర్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలంతా ఉత్సాహంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. 65 శాతానికిపైగా ఓటింగ్ పెరిగే అవకాశం ఉంద ని అంచనా వేశారు. ఫలితాల అనంతరం కాంగ్రెస్, బీజేపీ కూటమికి సరైన మెజార్టీ రాదని, దేశంలో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్రను పోషించే అవకాశం ఉందని తెలిపారు. రాబోయేరోజుల్లో బీఆర్ఎస్ కేంద్రంలోనూ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.