DC vs UPW : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ జోరు కొనసాగించింది. వరుసగా రెండో విజయం నమోదు చేసింది. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌ను చిత్తు చేసింది. ఓపెనర్ మేగ్ లానింగ్ (70), (34), జెస్ జొనాసెన్ (42) విధ్వంసక బ్యాటింగ్‌తో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ రెండొందలు కొట్టిన ఢిల్లీ ప్రత్యర్థిని 169 పరుగులకే పరిమితం చేసింది. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారీ విజయంతో రెండో స్థానాన్ని పదిలం చేసుకుంది. ఈ లీగ్‌లో యూపీ వారియర్స్‌కు ఇది తొలి ఓటమి.
టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు వికెట్ల నష్టానికి 211 రన్స్ చేసింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ మేగ్ లానింగ్ (70) అర్ధ శతకంతో చెలరేగింది. జెమీమా రోడ్రిగ్స్ (34), జెస్ జొనాసెన్ (42) చివర్లో ధాటిగా ఆడారు. దాంతో, ఆ జట్టు 200 ప్లస్ స్కోర్ చేయగలిగింది. భారీ లక్ష్య ఛేదనలో యూపీ వారియర్స్ ఆది నుంచే తడబడింది. తొలి ఓవర్లో రెండు ఫోర్టు కొట్టిన ఓపెనర్ అలిసా హేలీ (24) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగింది. దీప్తి శర్మ(12), దేవికా వైద్యా(23) తొందరగా ఔటయ్యారు. తహ్లియా మెక్‌గ్రాత్ ఫిఫ్టీ(90)తో చెలరేగినా కూడా ఆ జట్టు 169 పరుగులకే పరిమితం అయింది ఢిల్లీ బౌలర్లలో జొనాసెన్ మూడు, మరిజానే కాప్, శిఖా పాండే తలా ఒక వికెట్ తీశారు.
గుజరాత్ జెయింట్స్‌పై కీలక ఇన్నింగ్స్ ఆడిన తహ్లియా మెక్‌గ్రాత్ రెచ్చిపోయింది. 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా మెక్‌గ్రాత్ దూకుడుగా ఆడింది. 11 ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో 90 రన్స్ చేసింది. దేవికా వైద్యా(23)తో కలిసి ఐదో వికెట్‌కు 37రన్స్, దీప్తి శర్మ(12)తో కలిసి నాలుగో వికెట్‌కు 40 రన్స్ జోడించింది. దీప్తి(12)ని శిఖా పాండే ఔట్ చేసింది. ఫామ్‌లో లేని ఓపెనర్ షెరావత్ (1) ఔట్ అయింది. 31 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి జొనాసెన్ యూపీని దెబ్బకొట్టింది. ధాటిగా ఆడుతున్న ఓపెనర్ అలిసా హేలీ (24), కిరణ్ నవ్‌గిరే(0)ను ఆమె పెవిలియన్ పంపింది. సాధించాల్సిన రన్‌రేట్ 17పైనే ఉండడంతో ఆ జట్టు ఒత్తిడిలో పడింది. గత మ్యాచ్‌లో విరోచిత ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించిన గ్రేస్ హ్యారిస్‌ను పక్కన పెట్టిన యూపీ భారీ మూల్యం చెల్లించుకుంది.
రెండో మ్యాచ్‌లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు షఫాలీ వర్మ (17), మేగ్ లానింగ్ (70) శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు పరుగులు జోడించారు. దాంతో, జట్టు భారీ స్కోర్‌కు పునాది వేశారు. 67 పరుగుల వద్ద ఢిల్లీ మొదటి వికెట్ పడింది. కిరణ్ నవిగెర్ బౌండరీ వద్ద డైవింగ్ క్యాచ్ పట్టడంతో షఫాలీ ఔట్ అయింది. ఆమె ఔటయ్యాక లానింగ్ స్పీడ్ పెంచింది. ఈ ఓపెనర్ 42 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 70 స్కోర్ చేసింది. యూపీ బౌలర్లపై విరుచుకు పడిన ఆమె 170 స్ట్రయిక్ రేటుతో బ్యాటింగ్ చేసింది. 144 వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో వికెట్ పడింది. ఆ తర్వాత జెమీమా, జొనాసెన్ సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు. జొనాసెన్ సిక్సర్లతో యూపీ బౌలర్లపై విరుచుకుపడింది.