MCA : ముంబై క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధిలో దిగ్గజ క్రికెటర్లను భాగస్వామ్యులను చేసింది. మాజీ ప్లేయర్లు దిలీప్ వెంగ్సర్కార్ (Dilip Vengsarkar), డయానా ఎడుజీ (Diana Edulji)లను క్రికెట్ సలహాదారులుగా నియమించింది. మహిళల క్రికెట్ అభ్యున్నతికి డయానా కృషి చేయనుంది. ముంబైలో సోమవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఎంసీఏ ఈ తీర్మానం చేసింది. ప్రస్తుతం ఎంసీఏ క్రికెట్ పురోగతి కమిటీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ పేసర్ రాజు కులకర్ణి(Raj Kulakarni)కు మళ్లీ అవే బాధ్యతలను కట్టబెట్టింది.
‘ఎంసీఏలో దిలీప్ వెంగ్సర్కార్ భాగం కావడం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్రికెట్ బలోపేతానికి ఆయన ఎంతగానో కృషి చేయనున్నారు. ముంబైలో మహిళా క్రికెట్ వ్యాప్తికి డయానా ఎంతో పాటుపడ్డారు. ఈకాలం అమ్మాయిలకు తను స్ఫూర్తి. అందుకే.. భారత క్రికెట్లో లెజెండ్స్ అయిన వీళ్లకు అడ్వైజర్స్గా నియమించాం.
From being a batting stalwart, successful captain, and 1983 World Cup winner, to shaping 🇮🇳 cricket’s future as BCCI Chairman of Selectors, Dilip Vengsarkar has been a true force! 🫡
Wishing you a very happy birthday, Dilip Ji! 🥳#PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/bVyKTFMctS
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 6, 2025
ప్రస్తుతం ఎంసీఏ క్రికెట్ పురోగతి కమిటీలో సభ్యులుగా ఉన్నవాళ్లను తిరిగి నియమిస్తున్నాం. గత సీజన్లో దేశవాళీ క్రికెట్లో అన్ని విభాగాల్లో ముంబై జట్లు అద్బుతంగా రాణించాయి. అందుకే.. క్రికెట్ ఇంప్రూవ్మెంట్ కమిటీలోని ఏ ఒక్కరినీ మార్చాలని అనుకోవడం లేదు అని ఎంసీఏ అధ్యక్షుడు అజింక్యా నాయక్ (Ajinkya Naik) వెల్లడించాడు. ఎంసీఏ క్రికెట్ పురోగతి కమిటీలో సహిల్ కుక్రేజా, ప్రీతి దిమ్రిలు ఇతర సభ్యులుగా ఉన్నారు.