FIH Pro League : ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో భారత పురుషుల జట్టుకు వరుసగా రెండో షాక్ తగిలింది. అలవోకగా గెలవాల్సిన మ్యాచ్‌లో అలసత్వం ప్రదర్శించిన టీమిండియా మరోసారి నెదర్లాండ్స్(Netherlands) చేతిలో చేజేతులా ఓడిపోయింది. శనివారం 1-2తో పరాజయం మూటగట్టుకున్న భారత్.. ఈసారి ఆఖరి నిమిషంలో గోల్ సమర్పించుకొన్న హర్మన్‌ప్రీత్ సింగ్ సేన విజయాన్ని చేజార్చుకుంది. దాంతో, లీగ్‌లో బోణీ కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
యూరప్ పర్యటనలో తొలి పోరులో నెదర్లాండ్స్‌పై ఓటమికి బదులు తీర్చుకోవాలనుకున్న భారత ఆటగాళ్లు రెండోమ్యాచ్‌లో దూకుడుగా ఆడారు. వందో మ్యాచ్ ఆడుతున్న అభిషేక్ 20వ నిమిషంలో గోల్ చేయగా ఆధిక్యంలోకి వెళ్లింది. కాసేపటికి నెదర్లాండ్స్ తరఫున తిజ్స్ వాన్ డామ్ (24వ నిమిషం) గోల్ సాధించగా స్కోర్లు సమం అయ్యాయి.
Not the result we hoped for.
Abhishek marked his 100th game with a goal, but the Netherlands snatched it in the dying minutes of Q4.Plenty of learnings from both matches, the boys will bounce back stronger!#HockeyIndia #IndiaKaGame @CMO_Odisha @sports_odisha @IndiaSports… pic.twitter.com/6mOODYPHIR
— Hockey India (@TheHockeyIndia) June 9, 2025
తొలి గోల్‌తో పోటీలోకి వచ్చిన డచ్ జట్టుకు జెప్ హొడెమేకర్స్(33వ నిమిషం) రెండో గోల్ అందించాడు. 2 గోల్స్‌తో నెదర్లాండ్ విజయం దిశగా సాగుతున్న వేళ జుగ్రాజ్ సింగ్ 54వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను ప్రత్యర్థి గోల్ పోస్ట్‌లోకి పంపాడు. దాంతో.. మ్యాచ్ డ్రా అవుతుందనిపించింది. కానీ, డచ్ ప్లేయర్ జిప్ జన్సెన్(57వ నిమిషంలో) గోల్ చేయగా టీమిండియాకు ఓటమి తప్పలేదు.
తొలి అర్ధ భాగంలోనే భారత్‌కు 9 పెనాల్టీ కార్నర్స్ లభించాయి. ఆట మొదలైన ఆరో నిమిషంలోనే గోల్ చేసే అవకాశం వచ్చినా అభిషేక్ సఫలం కాలేదు. కాసేపటికే శిలానంద్ లక్రా మిడ్‌ఫీల్డ్ నుంచి బంతిని ప్రత్యర్థి గోల్ పోస్ట్‌లోకి బంతిని పంపాలనుకున్నాడు. కానీ, బంతి బయటకు వెళ్లింది. ఆ తర్వాత కూడా ఛాన్స్‌లు వచ్చినా భారత స్టార్ ఆటగాళ్లు గోల్ చేయడంలో విఫలం అయ్యారు. తదుపరి మ్యాచ్‌లో జూన్ 11న అర్జెంటీనాతో టీమిండియా తలపడనుంది.